బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 22 జులై 2014 (13:12 IST)

అత్యాచారాలపై రమ్య ట్వీట్స్: మగాడిలో మార్పు రావాలి.. లేకుంటే?

బెంగళూరులో చిన్నారిపై అత్యాచారం ఘటనపై కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్య తీవ్రంగా స్పందించారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మగవాడిలో మార్పు రావాల్సిందేనని వ్యాఖ్యానించారు. మగాడిలో మార్పు రానిదే ఫలితం ఉండదని రమ్య కామెంట్ చేశారు. 
 
పోస్కో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్స్) చట్టంలో మార్పులు, ఆయా ప్రదేశాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వంటి చర్యలు అవసరమని రమ్య అభిప్రాయపడ్డారు. మార్పు ముఖ్యంగా మగవాడి నుంచే మొదలవ్వాలని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్లో రమ్య స్పందిస్తూ.. పాఠశాలల యాజమాన్యాలు చిన్నారుల పట్ల జవాబుదారీతనంతో వ్యవహరించాలని సూచించారు. 
 
బెంగళూరులోని ఓ పాఠశాలలో స్కేటింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తి అదే పాఠశాలలో చదువుతున్న చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. పోలీసులు ఆ స్కేటింగ్ ఇన్‌స్ట్రక్టర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, చిన్నారిపై అత్యాచారం ఘటన పట్ల బెంగళూరు భగ్గుమంది. విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.