మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 29 జూన్ 2015 (10:37 IST)

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జైలుకే : చట్ట ముసాయిదాపై కేంద్రం దృష్టి

స్వచ్ఛభారత్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం దాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా.. బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాలల్లో ఉమ్మి వేయడం, చెత్తచెదారం వేయడం, మలమూత్ర విసర్జన చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఈ కఠిన చర్యల్లో జైలుశిక్షను కూడా విధించే అవకాశం ఉంది. 
 
ఇందుకోసం 'మోడల్' చట్టాన్ని రూపొందిస్తోంది. రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా ఈ చట్టాన్ని అమలు చేసుకోవచ్చు. అంటే, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం, మూత్రం పోయడం, చెత్త వేయడం వంటి సంఘటనల్లో బాధ్యులకు మునిసిపాలిటీలు శిక్షలు, జరిమానాలు విధించొచ్చు. అయితే, ఈ శిక్షల విధింపు వల్ల కొత్తతరహా న్యాయ చిక్కులు రాకుండా కేంద్రం జాగ్రత్తపడుతోంది.