గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : మంగళవారం, 30 జూన్ 2015 (11:33 IST)

కంచి పట్టు.. ధర్మవరం పట్టు చీరె విన్నాం.. సేంద్రియ చీరె ఏంటి?

చీరెలలో ఎన్నో రకాల చీరెలు విన్నారు. సినిమా పేర్లతో.. చెంగావి రంగు చీరె విన్నాం. సోగ్గాడు చీరె విన్నాం. అలాగే కంచి పట్టు.. ధర్మం పట్టు... బెనారస్ పట్టు ఇలా ఎన్నో చీరెలు చూశాం. ఈ  సేంద్రియ చీరె ఏంటి..? ఈ చీరెను కో-ఆప్టెక్స్‌ తొలిసారిగా ఆవిష్కరించింది. ఏమిటి స్పెషాలిటి? 
 
తమిళనాడు ప్రభుత్వ రంగ సంస్థ సేలం నగరంలోని ‘తంగంపట్టు మాలిగై’ షోరూంలో.. కో-ఆప్టెక్స్‌ ఎండి టీఎన్‌ వెంకటేశ్‌ పర్యావరణహిత సేంద్రియ పత్తి చీరను  విడుదల చేశారు. రసాయనాలు, ఆధునిక ఎరువులు వినియోగించకుండా పండించిన పత్తితో ఈ సేంద్రియ చీరలు తయారుచేశామని ఆయన తెలిపారు.
 
చీరకు అద్దిన రంగులు కూడా ప్రకృతి సహజమైన పూలు, మొక్కలు, మూలికల నుంచి సేకరించినవేనని చెప్పారు. చేనేత మగ్గాలపై రూపొందించిన ఈ చీరల ఖరీదు రూ.2,750 నుంచి రూ.4 వేల మధ్య ఉంటుందన్నారు. ఇవి చాలా తేలిగ్గా ఉంటాయన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా చీరల అమ్మకాన్ని కూడా కో-ఆప్టెక్స్‌ ప్రారంభించిందని వెంకటేశ్‌ తెలిపారు.