గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 18 ఫిబ్రవరి 2017 (10:17 IST)

పళనిస్వామికి మరో షాక్... మరో ఎమ్మెల్యే జంప్... ఓటింగ్‌కు దూరంగా కరుణానిధి

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామికి మరో షాక్ తగిలింది. కాసేపట్లో అసెంబ్లీలో బల నిరూపణ పరీక్షను ఆయన ఎదుర్కోబోతున్నారు. అత్యంత ఉత్కంఠభరితంగా ఉన్న ఈ సమయంలో, పళనిస్వామికి మరో షాక్ తగిలింది.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామికి మరో షాక్ తగిలింది. కాసేపట్లో అసెంబ్లీలో బల నిరూపణ పరీక్షను ఆయన ఎదుర్కోబోతున్నారు. అత్యంత ఉత్కంఠభరితంగా ఉన్న ఈ సమయంలో, పళనిస్వామికి మరో షాక్ తగిలింది. ఇప్పటి వరకు ఆయన శిబిరంలో ఉన్న కోయంబత్తూరు (నార్త్)కు చెందిన ఎమ్మెల్యే అరుణ్ కుమార్ జంప్ అయ్యారు. పళనిస్వామికి అనుకూలంగా తాను ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయబోనని ఆయన బహిరంగంగా ప్రకటించారు. 
 
మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు కూడా మద్దతు ఇవ్వబోనని తేల్చి చెప్పారు. తాను తటస్థంగా ఉంటానని, ఓటింగ్‌కు దూరంగా ఉంటానని ప్రటించారు. అరుణ్ కుమార్ ఝులక్ ఇవ్వడంతో పళనిస్వామి బలం 122కు పడిపోయింది. బల పరీక్షలో ఆయన నెగ్గాలంటే 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అరుణ్ కుమార్ జంప్ కావడంతో, పళనిస్వామి శిబిరం కలవరపడుతోంది. ఓటింగ్ సమయానికి ఇంకా ఎంత మంది ఎమ్మెల్యేలు తమను వ్యతిరేకిస్తారో అనే భయం వారిని ఆవరించుకుంది.