Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కన్నడ నటికి చుక్కలు చూపించిన టెక్కీ.. స్నేహం-ప్రేమ- సహజీవనం.. చివరికి పెద్దలు వద్దన్నారని?

గురువారం, 15 జూన్ 2017 (13:10 IST)

Widgets Magazine

కన్నడ నటికి ఓ టెక్కీ ముఖం చాటేశాడు. కన్నడనటితో స్నేహం చేసి.. ఆమెను ప్రేమించి.. ఆపై సహజీవనం చేశాడు. తీరా పెళ్లి మాటెత్తే సరికి.. పెద్దలు అంగీకరించలేదని ముఖం చాటేశాడు. దీనిపై కన్నడనటి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. కన్నడ నటి, ప్రాజెక్టు మేనేజర్ (టెక్కీ) ఉల్లాస్ పటేల్ గత రెండేళ్లుగా స్నేహితులు. వీరి స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ చాలా చనువుగా ఉంటారని.. గతమూడు నెలల నుంచి సహజీవనం చేస్తున్నట్లు స్నేహితులు తెలిపారు. బెంగళూరు సదాశివనగర సమీపంలో కుటుంబ సభ్యులకు తెలీకుండా ప్రత్యేకంగా ఇల్లు తీసుకుని సహజీవనం చేశారని సమాచారం.
 
జూన్ 3వ తేదీన తాను పనిపై మైసూరుకు వెళ్లానని, తిరిగి వచ్చి చూడగా ఉల్లాస్ పటేల్ మాయం అయ్యాడని, ఫోన్ చేస్తే మన పెళ్లికి మా పెద్దలు అంగీకరించడం లేదని.. మన పెళ్లి జరగదని చేతులెత్తేసినట్లు కన్నడ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉల్లాస్ పటేల్‌తో పాటు ఆమె తల్లి తన మొబైల్‌కు ఫోన్ చేసి మర్యాదగా ఉండకపోతే నీ అంతు చూస్తాం అంటూ బెదిరింపులు వస్తున్నాయని.. దీంతో తన ప్రాణానికి హాని పొంచివుందని కన్నడనటి పోలీసులకు వెల్లడించింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉల్లాస్ పటేల్‌పై ఐపీసీ 376, 417 సెక్షన్‌ల కింద అత్యాచారం, మోసం తదితర కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. విచారణ కూడా మొదలు పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పళణిస్వామి ఎప్పుడైనా పదవీగండం తప్పదా? ఆగస్టు తర్వాత అవిశ్వాస పరీక్ష!

తమిళనాడు ముఖ్యమంత్రి పళణిస్వామికి పదవీగండం దగ్గరలోనే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏ ...

news

పశువధ నిషేధంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు.. స్టేకు నిరాకరణ

పశువుల రవాణా, వధపై కేంద్రం విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ...

news

బాహుబలి ఎఫెక్ట్.. రానా వాహనం స్ఫూర్తితో ''దుర్గ్‌ రోడ్ క్లీనర్''

బాహుబలి సినిమా ప్రభావం దేశవ్యాప్తంగా ఉంది. రాజకీయ పార్టీల అధినేతలను ఆ పార్టీ నేతలు ...

news

బెనజీర్ భుట్టో కుమారుడి ఇఫ్తార్ విందు.. చికెన్ బిర్యానీ కోసం కొట్టుకున్న అతిథులు..

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, దివంగత బెనజీర్ భుట్టో కుమారుడు, పీపుల్స్ పార్టీ ఛైర్మన్ ...

Widgets Magazine