గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 15 మార్చి 2017 (10:54 IST)

అమ్మకు సంతానం లేరు.. అందుకే మృతి.. కరుణ ఆరోగ్యం కుదుటపడింది.. కారణం?

తమిళనాడు దివంగత సీఎం జయలలిత అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమెకు సంతానం లేకపోవడంతో అమ్మ ఆరోగ్యంపై శ్రద్ధ చూపేందుకు ఎవ్వరూ లేకపోయారు. స్నేహితులమని పక్కన ఉండిన కొంతమంది మందులిస్తామని.. వాటిని మార్చేసి.. కొట్ట

తమిళనాడు దివంగత సీఎం జయలలిత అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమెకు సంతానం లేకపోవడంతో అమ్మ ఆరోగ్యంపై శ్రద్ధ చూపేందుకు ఎవ్వరూ లేకపోయారు. స్నేహితులమని పక్కన ఉండిన కొంతమంది మందులిస్తామని.. వాటిని మార్చేసి.. కొట్టి ఆస్పత్రిలో చేర్చారని ఆరోపణలున్నాయి. అందుకే అమ్మ ఆరోగ్యం క్షీణించిందని.. ఆమె ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునేవారు లేకపోవడం వల్లే త్వరలో ఆమె కన్నుమూశారని అన్నాడీఎంకే కార్యకర్తలు అనుకుంటున్నారు. 
 
అయితే డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి బాగా కోలుకుంటున్నారని టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఎస్‌. తిరునావుక్కరసర్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా కరుణ తీవ్ర అస్వస్థత నుంచి కోలుకుంటున్నారని, తనను బాగా గుర్తుపెట్టి కూర్చోమని సైగ చేశారని తెలిపారు. అరగంట తర్వాత తాను వెళ్లివస్తానని చెప్పగానే కరుణానిధి తలను ఊపారని, ఆయన గొంతులో ట్రక్యోస్టమీ పరికరం ఉండటం వల్ల మాట్లాడలేకపోతున్నారని ఆయన వివరించారు. 
 
ఆర్కేనగర్‌ ఉప ఎన్ని కల్లో డీఎంకేకు కాంగ్రెస్‌ మద్దతు ఇస్తుందని ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం రాత్రి తిరునావుక్కరసర్‌ గోపాలపురంలో కరుణానిధిని ఆయన నివాసగృహంలో కలుసుకున్నారు. ఆర్కేనగర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ డీఎంకేకు మద్దతునిస్తున్నట్లు కరుణానిధికి తెలుపగానే శభాష్‌ అనే రీతిలో చేతులు పైకెత్తి చూపారు.
 
 ఏది ఏమైనప్పటికీ కరుణానిధి ఆరోగ్యం ప్రస్తుతం మెరుగైందని తెలిపారు. అయితే అన్నాడీఎంకే కార్యకర్తలు మాత్రం అమ్మకు సంతానం ఉండివుంటే ఆమెను కళ్లల్లో పెట్టుకుని చూసుకుని వుండేవారని.. మన్నార్ గుడి మాఫియాను వేదనిలయంలో స్థానమిచ్చి అమ్మ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని బాధపడుతున్నారు.