Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫలించిన ఇస్రో 18 ఏళ్ల శ్రమ.... విజయవంతంగా కక్ష్యలోకి జీఎస్ఎల్వీ 3

సోమవారం, 5 జూన్ 2017 (18:12 IST)

Widgets Magazine

ఇస్రో 18 ఏళ్ల శ్రమ ఫలించింది. రోదసి నుంచి తొలి దేశీయ ఇంటర్నెట్ సేవలను అందించనున్న జీఎస్ఎల్వీ 3 విజయవంతంగా కక్ష్యలోనికి ప్రవేశించింది. 3,136 కిలోల బరువున్న వ్యోమ నౌక 16 నిమిషాల్లో పని పూర్తి చేసింది. దీనితో కమ్యూనికేషన్‌ల కోసం విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. అత్యంత భారీ రాకెట్ జియోసింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్(జీఎస్‌ఎల్‌వీ) మార్క్-3 డీ1 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు.
gslv3
 
ఈ అంతరిక్ష వాహక నౌకను నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. షార్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికారు. 43.43 మీటర్ల ఎత్తున్న జీఎస్‌ఎల్‌వీ మార్క్3-డీ1 ప్రయోగం 16:20 నిమిషాల్లో పూర్తయ్యింది. ఇస్రో చరిత్రలోనే అతిపెద్ద ప్రయోగం కావడంతో దీన్నంతా బాహుబలి 3 అని పిలుచుకుంటున్నారు. శాస్త్రవేత్తలు కాదు సుమా. బయటి జనం. దీని ప్రయోగంతో ఇస్రో భవిష్యత్తులో మానవ సహిత ప్రయోగాలు నిర్వహించేందుకు మార్గం సుగమం అయింది. ఈ అంతరిక్ష నౌక కోసం 18 ఏళ్లుగా శ్రమించారు. దీనికి రూ.300 కోట్లు ఖర్చు పెట్టారు. భారతదేశం తన సొంతగడ్డ పైనుంచి తొలిసారి ప్రయోగించిన అత్యంత భారీ ఉపగ్రహం కూడా ఇదే కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి కనబరిచారు. 
 
ఇది రోదసి నుంచి ఇంటర్నెట్ సేవలందించనున్న తొలి దేశీయ శాటిలైట్. హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించే లక్ష్యంతో జీశాట్-19ని ప్రయోగించామనీ, ఇది కేవలం ఓ ట్రైలర్ అనీ అసలు సినిమా అంతా మరికొద్ది నెలల్లో ప్రయోగించనున్న జీశాట్-11దేనని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కోడలిపై మామ అత్యాచారం.. కాల్చి చంపేసిన అత్త.. ఎవరిని? భర్త ఆర్మీ ఆఫీసరైనప్పటికీ?

కోడలిపై మామ అత్యాచారానికి పాల్పడిన ఘటన పాకిస్థాన్‌లోని పెషావర్‌లో చోటుచేసుకుంది. అయితే ...

news

షార్ సెంటర్ నుంచి గం. 5.30 నిమిషాలకు 'బాహుబలి' జీశాట్-19, త్వరలో రోదశిలోకి మానవుడు...

ఇస్రో చరిత్ర సృష్టించబోతోంది. ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు ఆ చరిత్రకు శ్రీకారం ...

news

ప్రపంచ దేశాలు ఇకనైనా మేల్కోండి... సిరియన్ బాలుడి ఆవేదన (Video)

సిరియాలో ఐఎస్ ఉగ్రవాదుల దాష్టీకాలు అంతా ఇంతా కావు. మహిళలు, చిన్నారులని తేడా లేకుండా ...

news

చైనాకు వెళ్లడంతోనే గుంటూరుకు రాలేదా..? చిరంజీవి పార్టీ నుంచి దూరమయ్యారా?

కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ ...

Widgets Magazine