మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 జులై 2015 (12:03 IST)

కేరళ ఉప ఎన్నికలు: కాంగ్రెస్ విన్.. బీజేపీ ఓడినా హ్యాపీ..

కేరళ ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ బీజేపీ శిబిరంలో ఆనందాన్ని నింపాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ.. తొలిసారిగా రాష్ట్రంలో ముక్కోణపు పోటీని, కాంగ్రెస్, కమ్యూనిస్టులకు ధీటుగా బీజేపీ ఎదిగిన తీరుకు ఎన్నికల ఫలితం నిదర్శనంగా నిలిచింది. 
 
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి అధికారంలోకి వస్తామని ఘంటాపథంగా చెబుతున్న ముఖ్యమంత్రి చాందీ సైతం బీజేపీ ఎదుగుతున్న తీరును అంగీకరించారు. తమ పార్టీకి పెరుగుతున్న ఆదరణ మరింత కాలం కొనసాగుతుందని, వచ్చే సంవత్సరానికి మరింత ప్రభావం చూపుతామని, ఉపఎన్నికల్లో ఓడిపోయినా తమ పనితీరు ఉత్సాహాన్ని నింపిందన్నారు.
 
ఇకపోతే.. 2011 ఎన్నికల్లో కేవలం 7 వేల ఓట్లతో సరిపెట్టుకున్న బీజేపీ, ఈ ఉపఎన్నికల్లో ఏకంగా 23.96 శాతం ఓట్లను దక్కించుకుంది. అరువిక్కర నియోజకవర్గానికి ఎన్నిక జరుగగా, కాంగ్రెస్ అభ్యర్థి కేఎస్ శబరీనాథన్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి ఓ రాజగోపాల్‌కు 34 వేల ఓట్లు వచ్చిన సంగతి తెలిసిందే.