గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 18 ఫిబ్రవరి 2017 (14:24 IST)

తమిళనాడు అసెంబ్లీ పరిణామాలు దురదృష్టకరం: కపిల్ సిబాల్

తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో గురువారం చోటుచేసుకున్న సంఘటనలు చాలా దురదృష్టకరమని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబాల్ అన్నారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సభ్యులంతా ఆమెదించాల్సిందే అని చెప్పా

తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో గురువారం చోటుచేసుకున్న సంఘటనలు చాలా దురదృష్టకరమని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబాల్ అన్నారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సభ్యులంతా ఆమెదించాల్సిందే అని చెప్పారు. ముఖ్యంగా స్పీకర్‌పై కూడా దాడికి యత్నించడం మంచిది కాదన్నారు. 
 
మరోవైపు అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలను టీవీల్లో చూపించకపోవడంపై సుప్రీంకోర్టు మాజీ జడ్జి మార్కండేయ కట్జూ మండిపడ్డారు. ఇది అప్రజాస్వామికమన్నారు. మరోవైపు, వాయిదా అనంతరం కూడా సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో, మరోసారి సభను మూడు గంటలకు స్పీకర్ ధనపాల్ వాయిదా వేశారు. 
 
అయితే, డీఎంకే సభ్యులు మాత్రం సభలోనే తిష్ట వేసి ధర్నా చేస్తున్నారు. ఎమ్మెల్యేలను బయటకు పంపేందుకు అసెంబ్లీ మార్షల్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నా డీఎంకే సభ్యులు మాత్రం సభ నుంచి బయటకు వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు.