బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 25 అక్టోబరు 2014 (16:51 IST)

స్వచ్ఛ భారత్‌లో శశిథరూర్.. చీపురు పట్టుకుని చెత్తచెదారాన్ని..

కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన స్వచ్ఛ్ భారత్ పిలుపును అందుకుని కేరళలో తన నియోజకవర్గ పరిధిలోని విఝింజమ్ వద్ద చీపురు పట్టుకుని చెత్తచెదారాన్ని ఊడ్చి శుభ్రం చేశారు. 
 
కాగా థరూర్ భాజపాకు చెందిన నరేంద్ర మోడీకి మద్దతుగా మాట్లాడటంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. కేరళ కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదు మేరకు ఆయనను ఏఐసీసీ పదవి నుంచి తొలగించారు. అయినప్పటికీ శశి థరూర్ తన వైఖరి మార్చుకోలేదు. 
 
తనను తొలగించడంపై శశి థరూర్ మాట్లాడుతూ.. తాను ఏనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేయలేదు. స్వచ్ఛ్ భారత్ మోడీ  పుట్టించలేదనీ, దానిని ఎన్నడో గాంధీజీ చెప్పారని వెల్లడించారు. దేశాన్ని శుభ్రంగా ఉంచడం అనే కాన్సెప్ట్ రాజకీయాలకు అతీతమైనదనీ, దానిని పార్టీలతో ముడిపెట్టి చూడకూదని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకే చురకలు అంటించారు శశి థరూర్