Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సోనియా గాంధీకి వైరల్ ఫీవర్.. శ్రీ గంగా ఆస్పత్రిలో చేరిక.. సుర్జేవాలా

మంగళవారం, 29 నవంబరు 2016 (16:05 IST)

Widgets Magazine
sonia gandhi

కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాందీ మరోసారి ఆస్పత్రి పాలయ్యారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచార ర్యాలీని ప్రారంభించిన ఆమె.. అక్కడ ప్రచారరథం మీద నుంచి పడిపోవడంతో చేతికి గాయమైంది. అప్పట్లో ఆమెను ఢిల్లీలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చాలా కాలం పాటు ఆమెకు చికిత్స అందించాల్సి వచ్చింది. తాజాగా వైరల్ ఫీవర్ కారణంగా ఆమెను ఢిల్లీ శ్రీ గంగా ఆస్పత్రిలో చేర్చినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుర్జేవాలా ప్రకటించారు. 
 
గతంలో కేన్సర్ బారిన పడిన సోనియా గాంధీకి అమెరికాలో చికిత్స అందించారు. గడిచిన మూడు నెలల్లో సోనియా గాంధీని ఆస్పత్రికి తరలించడం ఇది రెండోసారి అని.. రెండు రోజుల పాటు ఆమె గంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతారని సుర్జేవాలా తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 3వ తేదీన సోనియా గాంధీని భుజం నొప్పి, డీహైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేర్చారు. ఆ సందర్భంగా ఆమెకు చిన్నపాటి శస్త్రచికిత్స కూడా చేశారు. ప్రస్తుతం జ్వరం కారణంగా ఆమె ఆస్పత్రిలో చేరినట్లు సుర్జేవాలా ప్రకటించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వామ్మో.. ఆ జైలులో టెర్రరిస్టులు, గ్యాంగ్‌స్టర్ల రాజభోగాలు అనుభవిస్తున్నారట.. బర్త్ డే కేకులు, కుక్‌లు, జిమ్‌లు?

పంజాబ్‌లోని పాటియాలా ప్రాంతంలోని నాభా కారాగారంలో శిక్ష అనుభవించే ఉగ్రవాదులు, ...

news

పావురాళ్ళకు గర్భనిరోధక మాత్రలు.... గోల చేస్తున్న జంతు ప్రేమికులు

సాధారణంగా వీధి కుక్కల బెడద ఎక్కువైతే వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి.. కుక్కల ...

news

తమ్ముడిని బయటకు పంపి గర్ల్‌ఫ్రెండుతో అన్న శ్రుంగారం... చలి పులి తట్టుకోలేక అన్నను హత్య..

ఢిల్లీలో దారుణం జరిగింది. గర్ల్‌ఫ్రెండ్ వివాదంలో తమ్ముడు అన్నను చంపేశాడు. అర్థరాత్రిపూట ...

news

కేసీఆర్ కామెంట్స్ ఎఫెక్ట్... భాజపా ఎంపీలు, ఎమ్మెల్యేలు బ్యాంకు వివరాలు చెప్పండి... మోదీ

సోమవారం రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ...

Widgets Magazine