మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2015 (14:33 IST)

చదువూ సంధ్యా లేని రాందేవ్‌.. రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడరా?: కాంగ్రెస్

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ, మనోహర్ లాల్ ఖట్టర్ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇందుకోసం యోగా గురువు, ఆ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన బాబా రాందేవ్‌ను టార్గెట్ చేసుకుంది. చదువూ సంధ్యా లేని రాందేవ్‌ను, పాఠశాలల్లో యోగా పాఠాలు చెప్పేందుకు ఎలా అనుమతిస్తారని కాంగ్రెస్ విరుచుకుపడింది. 
 
అసలు రాందేవ్‌ను రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎలా నియమిస్తారని కాంగ్రెస్ పార్టీ నేత, ఆ రాష్ట్ర మాజీ మంత్రి సంపత్ సింగ్, ఖట్టర్ సర్కారును నిలదీశారు. ప్రాథమిక స్థాయి విద్య కూడా లేని రాందేవ్‌ను రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం కుదరదని కూడా సింగ్ తేల్చి చెప్పారు. అంతేకాక గురుకులాలను ఆచార్యకులాలుగా మార్చడాన్ని కూడా సింగ్ తప్పుబట్టారు.