గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 23 సెప్టెంబరు 2014 (10:42 IST)

కాంగ్రెస్ పార్టీలోని అతిపెద్ద జోకర్ రాహుల్ గాంధీ : ముస్తఫా!

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలో నాయకత్వ లక్షణాలు లేవని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అతిపెద్ద జోకర్ రాహుల్ గాంధీ అని కేరళ రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు టీహెచ్ ముస్తఫా సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
సాధారణంగా తమ పార్టీ సీనియర్లపై విమర్శలు చేస్తే తమ రాజకీయ భవిష్యత్ ఏమైపోతుందోనని చాలా మంది కాంగ్రెస్ నేతలు భయపడుతుంటారు. అందుకే ప్రాంతీయ పార్టీల నేతలు సీనియర్లను విమర్శించాలంటే ఒకటికి పది సార్లు ఆలోచన చేస్తారు. కానీ, ముస్తఫా మాత్రం ఏకంగా పార్టీ ఉపాధ్యక్షుడైన రాహుల్‌పైనే విమర్శలు గుప్పించారు. 
 
రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఓ పెద్ద జోకర్ అని అన్నారు. పార్టీ నుంచి బయటకు విసిరేసిన నేత రాహుల్ గాంధీ అని ఆయన దుయ్యబట్టారు. ప్రధాని మోడీని ముస్తఫా కొనియాడారు. కాశ్మీర్ వరదలను ఎదుర్కోవడంలో, ఇరాక్‌లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకురావడంలో మోడీ చూపిన ఆత్మస్థైర్యం తిరుగులేనిదని ఆయన కొనియాడారు.