గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 అక్టోబరు 2014 (15:18 IST)

బ్లాక్ మనీ లిస్ట్‌పై మాకు భయమా? నో ఛాన్స్!: చిదంబరం

స్విస్ బ్యాంకుల్లో అక్రమ సంపాదనను దాచుకున్న వ్యక్తుల జాబితా విడుదలపై కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం ధీమా వ్యక్తం చేశారు. బ్లాక్ మనీ లిస్టుకు సంబంధించిన జాబితా విడుదలపై తామేమీ భయపడట్లేదని చిదంబరం అన్నారు. 
 
సదరు జాబితాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కేంద్ర మాజీ మంత్రి ఉన్నారన్న దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లీకులు జారీ చేసిన సందర్భంగా చిదంబరం స్పందించారు. 
 
‘జాబితాలో పేర్లున్న వ్యక్తులు భయపడతారు తప్పించి, పార్టీ ఎందుకు కలవరపడుతుంది? ఈ తరహా అక్రమాలు వ్యక్తిగతమైనవి’ అని చిదంబరం వ్యాఖ్యానించారు. 
 
‘నల్ల కుబేరుల వెల్లడిలో బీజేపీ ప్రభుత్వం మా మాదిరే వ్యవహరిస్తోంది. న్యాయపరంగా సర్కారు నిర్ణయం సరైనదే. అయితే మాపైనే తిరిగి నిందలేస్తూ తప్పు చేస్తోంది’ అని చిదంబరం వ్యాఖ్యానించారు.