గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : బుధవారం, 17 డిశెంబరు 2014 (19:59 IST)

జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగానికి కౌంట్డౌన్ స్ట్రాట్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో.. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగానికి కౌంట్‌ డౌన్‌ మొదలైంది. అత్యంత బరువైన ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లేందుకు రూపొందించిన ఈ రాకెట్ కోసం బుధవారం ఉదయం 8 గంటల 30 నిముషాలకు కౌం
ట్ డౌన్ ప్రారంభమైంది. గురువారం ఉదయం 9 గంటలకు ఈ రాకెట్‌ నింగలోకి దూసుకెళ్లనుంది. 
 
ఈ విషయమై ఇస్రో శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. ఇది కేవలం ప్రయోగాత్మకమైనదేనన్నారు. రాకెట్ పైభాగంలో మూడు వేల కిలోల కంటే బరువైన క్రూ మాడ్యూల్‌ను అమర్చినట్లు తెలిపారు. ఇది భూమి నుంచి 136 కిలోమీటర్లు పైకి వెళ్లిన తరువాత దీనిని రాకెట్ వదిలేస్తుందన్నారు. పారాచూట్ల సాయంతో ఈ క్రూ మాడ్యూల్ తిరిగి భూమికి చేరుకుంటుందని తెలిపారు. 
 
దీనిని అండమాన్ కు సమీపంలోని సముద్రంలో దీనిని నెలపై దింపేందుకు ఇస్రో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమైతే .. భవిష్యత్తులో మన దేశం నుంచే అత్యంత బరువైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడానికి కుదురుతుందని తెలిపారు.