Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పెళ్లి కానీ జంట సహజీవనం చేయొచ్చు.. ఇండో-పాక్ జంటపై హైకోర్టు సంచలన తీర్పు

బుధవారం, 30 నవంబరు 2016 (10:22 IST)

Widgets Magazine
lovers romance

ప్రేమించుకున్న ఓ హిందూ యువతి, ఓ ముస్లిం యువకుడు కలిసి ఉండవచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది. అంతేగాకుండా పెళ్లి కానీ జంట సహజీవనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌‌లోని పాకిస్థాన్ సరిహద్దు గ్రామం ధనేరాకు చెందిన ముస్లిం యువకుడు (20), అదే ఊరికి చెందిన హిందూ అమ్మాయి (19) ప్రేమించుకున్నారు. స్కూల్ మేట్స్ కారణంగా కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. 
 
గత జులైలో ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ.. అబ్బాయి మైనర్‌ కావడంతో పెళ్లి సాధ్యం కాలేదు. దీంతో ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. వాళ్లిద్దరూ కలసి ఉన్నప్పుడు.. గత సెప్టెంబర్‌‌లో ఆ యువతి బంధువులు అమ్మాయిని ఇంటికి తీసుకుపోయారు. ప్రియురాలితో కలిసే ఉండేందుకు అనుమతించాలని కోరుతూ ముస్లిం యువకుడు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. కోర్టు ఆదేశాల మేరకు బనస్‌ కాంత్‌ పోలీసులు అమ్మాయిని విచారణకు హాజరుపర్చగా.. తాను ఆ యువకుడితో ఉంటానని కోర్టుకి తెలిపింది.
 
వాదనలు విన్న జడ్జిలు, ఆమెకు న్యాయసహకారం అందించకుండా ఉండలేమని.. ఆమెకు ఇష్టమైన చోట ఉండగోరే హక్కును కాదనలేమని చెప్పి.. తనకు ఇష్టమైతే ‌20 ఏళ్ల యువకుడితో కలిసే ఉండొచ్చు అని తీర్పు చెప్పారు. అయితే.. 21 ఏళ్లు నిండగానే అమ్మాయిని పెళ్లి చేసుకునే విధంగా యువకుడితో  అఫిడవిట్‌ దాఖలు చేయించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రేయసికి డబ్బివ్వలేదని.. తల్లిదండ్రులను, సోదరిని చంపేసిన దుర్మార్గుడు.. రాత్రంతా శవాలతో గడిపాడు..

ప్రియురాలు అడిగిన డబ్బు ఇవ్వలేదని తల్లిదండ్రులపై అలిగిన ఓ యువకుడు మద్యం తాగి ...

news

చికాగో జైలులో వింత ఘటన.. లాకప్‌లో లాక్ అయ్యాడు.. 6లక్షల డాలర్ల నష్టపరిహారం పొందాడు..

అమెరికా దేశంలోని చికాగో జైలులో వింత ఘటన చోటుచేసుకుంది. కుమారుడిని చూసేందుకు విజిటర్‌గా ...

news

అన్న-సోదరి ప్రేమ: శారీరకంగా కలిశారు.. గర్భం దాల్చిన సోదరికి విషపు ఇంజెక్షన్ వేసి పారిపోయాడు..

మానవీయ విలువలు మంటగలిసిపోయాయి. వావివరుసలు కనుమరుగవుతున్నాయి. తాజాగా అన్న-సోదరి మధ్య ...

news

మైనర్ కుర్రాడి చేతి వేళ్ళను తొలగించిన వైద్యుడికి రూ.4.5లక్షల జరిమానా

ఓ మైనర్ కుర్రాడి చేతి రెండు వేళ్ళను అతని తల్లిదండ్రుల అనుమతి లేకుండా తొలగించిన వైద్యుడి ...

Widgets Magazine