గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : శుక్రవారం, 22 మే 2015 (10:13 IST)

దుశ్శాసన పర్వం : చీరెలాగేసి.. జాకెట్ చించేసి.. లైంగిక వేధింపులు.. మహిళపై దాడి

అందరూ చూస్తుండగానే మగాళ్లంతా ఆమె పాలిట మృగాళ్లయ్యారు.. మహిళను బయటకు లాగారు. చీర ఊడబెరికేశారు. ఉన్న జాకెట్ చించేశారు. ఇక కట్టుకున్న బట్టలన్నింటిని చించేశారు. రోడ్డుపై దాడి చేశారు.  భూ తగాదా నేపధ్యంలో పాలఘర్ లో 45 ఏళ్ల మహిళపై ఐదారుగురు వ్యక్తులు దాడి చేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. 
 
ఆమెను వివస్త్రను చేసి హింసించి, లైంగికంగా వేధించి, దారుణంగా కొట్టారు. దాడికి పాల్పడినవారిలో నరేశ్ దోడి అనే కీలక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బోయిసర్ అనే మండలంలోని దాండి పాడా అనే గ్రామానికి చెందిన 45 ఏళ్ల మహిళకు కొంత భూమి ఉంది. దీనిని డెవలప్ మెంట్ కు ఇవ్వాల్సిందిగా నరేశ్ దోడీ అడగగా అందుకు ఆమె నిరాకరించింది. 
 
దీంతో ఆమెను జుట్టుపట్టుకొని బయటకు ఈడ్చుకొచ్చి రోడ్డుపైనే అందరు చూస్తుండగా చిత్రహింసలు పెట్టారు. కర్రలతో బాదారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉండగా, ఆమె ఆరు నెలల కిందటే ఆ భూమిని నరేశ్ దోడీ నుంచి కొనుగోలు చేయగా దానిని తనకే అభివృద్ధి చేసేందుకు ఇవ్వాలని ఇబ్బందులకు గురిచేస్తున్నాడట.