Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నేరగాళ్లను కాల్చి చంపేస్తున్నాం : సీఎం యోగి ఆదిత్యనాథ్

ఆదివారం, 19 నవంబరు 2017 (12:09 IST)

Widgets Magazine
yogi

తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగా మెరుగుపడినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయపడ్డారు. త్వరలో మునిసిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఘజియాబాద్‌లోని రామ్‌లీలా గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగుపడినట్టు చెప్పారు. నేరగాళ్లను జైలుకు పంపడమో, ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపడమో చేస్తున్నట్టు చెప్పారు. 
 
2017కు ముందు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపులో ఉండేది కాదు. నేరాలు ఇష్టానుసారం జరిగేవి. దీంతో భయపడిన వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, యువత రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన వారు తిరిగి వస్తున్నట్టు చెప్పుకొచ్చారు. పెట్టుబడులు వస్తున్నాయన్నారు. నేరగాళ్లకు ఇప్పుడు రెండే చోట్లు ఉన్నాయని, ఒకటి జైలుకు వెళ్లడం, లేదంటే యమరాజు ఇంటికి వెళ్లడమని వివరించారు. ఎక్కడికి వెళ్తారో వారే తేల్చుకోవాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జమ్మూకాశ్మీర్‌లో కాల్పులు: లఖ్వీ మేనల్లుడి హతం...

జమ్మూకాశ్మీర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు లష్కర్ తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. ...

news

జీన్స్ వేసుకొచ్చాడని తొడలు కోసిన టీచర్

సాధారణంగా విద్యార్థులు సరిగ్గా చదవకపోతేనో.. హోంవర్క్ చేయకపోతేనో కొడుతుంటారు. కానీ, ...

news

శత జయంత్యుత్సవం: ఇందిరమ్మ వందేళ్ల జ్ఞాపకాలు

జనరంజక పాలనతో ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న నాయకురాలు ఇందిరమ్మ. పాలన అంటే.. ఇందిరమ్మ ...

news

కార్తీక మాసం చివరి రోజున ఈ పని చేయడం ఎంతో సంతోషం... చంద్రబాబు

పచ్చదనంతో కూడిన అమరావతి నగర నిర్మాణం భావితరాల భవిష్యత్తుకు దిక్సూచి కావాలని రాష్ట్ర ...

Widgets Magazine