శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 18 ఫిబ్రవరి 2017 (11:17 IST)

శశికళ గది పక్కనే సైనైడ్ కిల్లర్.. చిన్నమ్మను హత్య చేసేందుకేనా?

అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ జైలుశిక్షను అనుభవిస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో నాలుగేళ్ళపాటు బెంగుళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో ఉన్నారు. ఈ జైలులో శశికళకు ప్రాణహాన

అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ జైలుశిక్షను అనుభవిస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో నాలుగేళ్ళపాటు బెంగుళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో ఉన్నారు. ఈ జైలులో శశికళకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ ఆమె తరపు న్యాయవాదులు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. 
 
ఈ నేపథ్యంలో శశికళ పక్క గదిలో ఓ గుండెలు తీసిన మహిళా ఖైదీ ఉంది. ఆమె ఎవరో కాదు సైనేడ్ మల్లిక. ఆరుగురు మహిళలపై విష ప్రయోగానికి పాల్పడ్డ నేరంపై మల్లిక జీవిత ఖైదు అనుభవిస్తోంది. దేవాలయాల వద్ద మహిళలను కలిసే మల్లిక వారి నగలను దోచుకోవడానికి సైనేడ్ ప్రయోగించిన కిరాతకురాలు. 
 
ఆమె మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చడంతో బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తోంది. బుధవారం జైలుకొచ్చిన శశికళతో మాట్లాడడానికి మల్లిక ప్రయత్నించగా ఆమె స్పందించలేదట. రెండో రోజు మాత్రం మల్లికను చూసి శశికళ నవ్విందట. జయలలిత అభిమాని అయిన మల్లికకు, శశికళకు మధ్య ఎలాంటి స్నేహం మొగ్గ తొడుగుతుందో లేదో వేచి చూడాల్సిందే.