Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

డిజిటల్ ఇండియా... డిజిటల్ ఇండియా అన్నారు... ఇప్పుడేమైంది... గుజరాత్ గుల్లవుతోంది...

మంగళవారం, 16 మే 2017 (20:19 IST)

Widgets Magazine

డిజిటల్ ఇండియా అంటూ అన్నీ నెట్లో పెట్టేసి నోట్లో వేలేసుకుని పడక కుర్చీలో కూర్చుని కంప్యూటర్లో చటుక్కున ఓ క్లిక్ కొడితే చాలు అన్నీ మన కళ్లముందే అని దర్జాగా కూర్చుంటే ఏమవుతుందో చూపిస్తున్నారు హాకర్లు. ప్రపంచాన్ని ఓ మోస్తరు లెవల్లో గడగడలాడిస్తున్న హాకర్లు తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తూనే వున్నట్లు వరుస హ్యాకింగ్ ఉదంతాలు బయటకు తెలుపుతున్నాయి. ఈ హాకింగ్ దెబ్బకు మన దేశంలో భారీగా దెబ్బతిన్నది గుజరాత్ ప్రభుత్వ పరిపాలనా విభాగం అంటున్నారు. 
Gujarat
 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో అంతా డిజిటల్ మయంగా మారుతోంది. గుజరాత్ ఈ విషయంలో చాలా ముందుకు వెళ్లిపోయింది. ఐతే తాజాగా రాన్సమ్వేర్ సైబర్ ఎటాక్ దెబ్బకు గుజరాత్ ప్రభుత్వంలోని పలు విభాగాల్లోని కంప్యూటర్లు పనిచేయడంలేదు. సైబర్ ఎటాక్ కారణంగా ఆయా విభాగాల్లోని కంప్యూటర్లను క్రాష్ చేసేస్తున్నారు. అంతేకాదు... ముందుజాగ్రత్తచర్యగా కంప్యూటర్లను స్విచాఫ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 
 
రాష్ట్ర ఐటీ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలుపుతూ... రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 120 కంప్యూటర్లకు వైరస్ అటాక్ అయిందని అన్నారు. అంతేకాదు... అన్ని డిపార్టుమెంట్లకు సెక్యూరిటీతో కూడిన ప్యాచ్‌లను ఇన్‌స్టాల్ చేసి అప్‌గ్రేడ్ చేయాల్సిందిగా సూచన చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటయా అంటే... ఏ ప్రైవేట్ కంపెనీకి చెందిన కంప్యూటర్లు సైబర్ అటాక్ కు గురికాకపోవడం. అంటే... ప్రభుత్వరంగ డిజిటలైజేషన్ ఎంత అధ్వాన్నంగా వుందో అర్థమవడంలేదూ....?!!Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భార్య మరో వ్యక్తితో లేచిపోయిందనీ.. కన్నబిడ్డను చంపేసిన కసాయి తండ్రి.. ఎక్కడ?

కట్టుకున్న భార్య తాము చెప్పిన మాట వినకుంటే ఏ భర్త కూడా తట్టుకోలేడు. అలాంటిది.. తనను కాదని ...

news

పెళ్లైన ఐదు రోజులకే భార్యను కడతేర్చాడు.. తలను నరికి అడవుల్లోనూ.. మొండాన్ని..?

పెళ్లి జరిగిన ఐదు రోజులకే నవ వధువు తనువు చాలించింది. నవ వధువును హత్య చేసింది.. జీవితాంతం ...

news

వ్యభిచారం చేసిన భార్యను చంపి.. కుక్కర్లో వండేశాడు.. ఎక్కడ?

భార్య వ్యభిచారం చేసిందని.. ఆ భర్త జీర్ణించుకోలేకపోయాడు. అంతే భార్యను చంపి.. కుక్కర్లో ...

news

ముక్కంటి ప్రాంతంలో మూడు ముక్కలాట...! బొజ్జలకు మూడునామాలేనా?

క్రమశిక్షణకు మారుపేరుగా ఐక్యతలో దిట్టగా, ఏకనాయకత్వానికి ఉదాహరణగా ఉంటూ వచ్చిన శ్రీకాళహస్తి ...

Widgets Magazine