శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (11:56 IST)

గేదెను దొంగలించాడని.. దళిత యువకుడి మర్మాంగంపై పెట్రోల్ పోసి.. హింసించారు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా జిల్లాలోని బర్హాన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గేదెను దొంగిలించాడనే ఆరోపణలతో కొంతమంది అగ్రకులస్థులు దళిత యువకుడిని కొట్టి నరకం చూపించిన ఘటన కలకలం సృష్టించింది. పోలీస

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గేదెను దొంగిలించాడనే ఆరోపణలతో కొంతమంది అగ్రకులస్థులు దళిత యువకుడిని కొట్టి నరకం చూపించిన ఘటన కలకలం సృష్టించింది. పోలీసులందించిన వివరాల ప్రకారం... దళిత యునకుడు గేదెను దొంగతనం చేశాడనే అనుమానంతో అతనిపై ఉన్నత కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేశారు. కర్రతో అతడిని విచక్షణా రహితంగా కొట్టాడంతో పాటు చెట్టుకుకట్టేసి బట్టలూడదీసి దారుణంగా కొట్టారు. అతడి మర్మాంగాలపై పెట్రోల్ పోసి హింసించారు. 
 
తమ గేదెను దొంగిలించారనే అనుమానంతో ఓ 15 మంది అగ్రకులస్తులు ఈ పనిచేసినట్లు బాధితుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా వాడు ఆ దొంగతనం చేయలేదు. అయినా, మా కొడుకును చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. అందరూ చూస్తుండగా బట్టలు విప్పేసి దారుణంగా హింసించారు. వాడి మార్మాంగాలపై పెట్రోల్ పోయడమే కాకుండా మత్తు సూదులు కూడా వేశారు' అంటూ ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకుని విచారణ చేపట్టారు.