బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 26 జులై 2016 (09:56 IST)

ఐరన్ రాడ్లు, బేస్ బాల్ బ్యాట్లతో దాడి చేసి... బతికుండగానే నిప్పంటించే యత్నం!

గుజరాత్ రాష్ట్రంలో దళితులపై దాడి జరిగిన తీరు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐరన్ రాడ్లు, బేస్ బాల్ బ్యాట్లు, కత్తులతో దాడి చేసి బతికుండగానే సజీవదహనం చేసేందుకు గో రక్షక దళ సభ్యులు ప్రయత్నించారని ప్రాణాల

గుజరాత్ రాష్ట్రంలో దళితులపై దాడి జరిగిన తీరు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐరన్ రాడ్లు, బేస్ బాల్ బ్యాట్లు, కత్తులతో దాడి చేసి బతికుండగానే సజీవదహనం చేసేందుకు గో రక్షక దళ సభ్యులు ప్రయత్నించారని ప్రాణాలతో బయటపడిన బాధితులు చెప్పుకొచ్చారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బాధితుల్లో ఒకడైన రవి జఖాడ ఈ దాడిపై మాట్లాడుతూ.. నలుగురు గో రక్షక దళ సభ్యులు తమ కాళ్లు, చేతులను గట్టిగా కదలకుండా పట్టుకున్నారని, మిగిలిన వారందరూ బ్యాట్లు, రాడ్లతో పాశవికంగా దాడి చేసి గాయపరిచినట్టు చెప్పారు. బాధితుల్లో ఎవరైనా మారు మాట్లాడివుంటే తమను చావగొట్టే వాళ్లని, అక్కడికి కోపం చల్లారని కొందరు కిరోసిన్ తీసుకొని రమ్మని తమతో పాటు ఉన్న సభ్యులకు చెప్పారని తెలిపారు. 
 
వీరందరిని గదిలో పడేసి తగులబెడదాం అని సభ్యులు మాట్లాడినట్లు తెలిపాడు. దళ సభ్యుల్లో ఇద్దరు కిరోసిన్‌ను తీసుకురావడానికి వెళ్లినట్టు తాను చూశానని రవి వెల్లడించాడు. ఇంతలో అక్కడికి వచ్చిన తన తండ్రి తమ కులం వారితో కలిసి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపాడు. తామంతా జీవితంపై ఆశలు వదిలేసుకుంటున్న సమయంలో పోలీసులు వచ్చి తమను రక్షించినట్లు చెప్పాడు. 
 
కాగా, గత మే 22వ తేదీన గో రక్షక దళం పలువురు దళిత యువతులను బంధించి దాడి చేసిన విషయం తెల్సిందే. ఇది ఆలస్యంగా వెలుగులోకి రావడంతో దేశ వ్యాప్తంగా పెను సంచలనమైంది. ఆవును హత్య చేసి చర్మం తీస్తున్నారన్న సందేహంతో పలువురు దళత యువకులపై 30 మంది గోరక్ష దళ సభ్యులు ఈ దాడికి పాల్పడ్డారు.