గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 24 ఆగస్టు 2017 (09:31 IST)

కన్యాకుమారిలో సముద్రం కల్లోలం.. కోస్తాలో విస్తారంగా వర్షాలు

తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో కడలి కల్లోలంగా ఉంది. దీంతో పర్యాటకుల పడవ ప్రయాణాన్ని రద్దు చేశారు. అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన కన్యాకుమారికి రోజు రోజుకి సందర్శకుల రాక పెరుగుతోంది. ఇక్కడకు నిత్యం

తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో కడలి కల్లోలంగా ఉంది. దీంతో పర్యాటకుల పడవ ప్రయాణాన్ని రద్దు చేశారు. అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన కన్యాకుమారికి రోజు రోజుకి సందర్శకుల రాక పెరుగుతోంది. ఇక్కడకు నిత్యం వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.
 
సముద్రంలో నిర్మించిన వివేకానంద స్మారక రాక్‌, తిరువళ్ళూర భారీ విగ్రహాలను చూసేందుకు బోటులో సముద్రంలోకి వెళుతుంటారు. మంగళవారం కన్యాకుమారికి భారీసంఖ్యలో పర్యాటకులు వచ్చినా, ఐదు రోజులుగా కొనసాగుతున్న కడలి కల్లోలం కారణంగా పడవ షికారు రద్దు చేశారు. దీంతో పలువురు అక్కడి నుంచి నిరుత్సాహంగా వెనుదిరిగారు.
 
ఇదిలావుండగా, ప్రస్తుతం కోస్తాంధ్ర, దాని చుట్టుపక్కల ప్రాంతాలపై సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం, ఈశాన్య బంగాళాఖాతం, దానిచుట్టుపక్కల ప్రాంతాల్లో సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడివుందని వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
ఈ కారణంగా కోస్తాంధ్ర జిల్లాల్లో రానున్న 3 రోజుల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉన్నట్లు తెలిపింది.