శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 2 జులై 2015 (11:20 IST)

డార్జిలింగ్ మృత్యుఘోషపై ప్రధాని మోడీ విచారం... ఆర్థిక సాయం

డార్జిలింగ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ప్రమాదంలో మృతి చెందినవారికి ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి నుంచి రూ.2 లక్షలు చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్టు ప్రకటించారు. 
 
అలాగే, సహాయ చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు డార్జిలింగ్ వెళ్లాయని.. అవసరమైన అన్ని సహాయ చర్యలు తీసుకుంటాయని ప్రధాని ట్వీట్ చేశారు. కాగా, తక్షణమే డార్జిలింగ్ వెళ్లి పరిస్థితి సమీక్షించాల్సిందిగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరెన్ రిజిజును కూడా ఆయన ఆదేశించారు. 
 
పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్‌లో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడ్డాయి. మంగళవారం రాత్రి నుంచి డార్జిలింగ్, కలింపాంగ్, కుర్సియాంగ్ సబ్ డివిజన్లలో కొండచరియలు విరిగిపడగా.. 38 మంది చనిపోయారు. 28 మంది గల్లంతైన విషయం తెల్సిందే.