మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Modified: శనివారం, 25 ఏప్రియల్ 2015 (07:56 IST)

కాశ్మీరులో నలుగురు రేపిస్టులకు ఉరి శిక్ష

కాశ్మీర్ కోర్టు శుక్రవారం సంచలన తీర్పు చెప్పింది. ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నలుగురు రేపిస్టులకు ఉరి శిక్ష విధించింది. బాలికను చెరపట్టి బలత్కారం చేసి హత్య చేసిన విధానాన్ని అత్యంత పాశవికంగా భావించింది. దీనిపై ఎనిమిదేళ్లు విచారణ జరిపిన తరువాత నేరస్థులకు ఉరి శిక్షను ఖారారు చేసింది. వివరాలిలా ఉన్నాయి. 
 
జమ్ము కాశ్మీర్లోని కుప్వారా ప్రాంతంలో ఉంటున్న సాదిక్ మీర్, అజర్ అహ్మద్ మీర్ ఇద్దరూ లాంగాటే ప్రాంతవాసులు. మోచి జహంగీర్ అన్సారీ పశ్చిమబెంగాల్ వాసి, సురేష్ కుమార్ రాజస్థాన్ నివాసి. 13 ఏళ్ల తబిందా గని అనే అమ్మాయి 2007 సంవత్సరంలో స్కూలు నుంచి తిరిగి వస్తుండగా నలుగురు ఆమెపై సామూహిక అత్యాచారం చేసి, చంపేశారు. 
 
అప్పట్లో ఈ కేసు సంచలనం సృష్టించింది. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోద చేయడంతో ఇన్నాళ్లుగా కోర్టులో విచారణ సాగింది. శుక్రవారం కోర్టు నలుగురుని దోషులుగా ప్రకటించి, మరణశిక్ష విధించింది. ఈ కేసును అత్యంత అరుదైనదిగా భావించి దోషులకు మరణశిక్ష విధించాలని బాధితురాలి కుటుంబసభ్యులు ఎప్పటినుంచో కోరుతున్నారు.