మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 17 ఏప్రియల్ 2017 (13:13 IST)

జయలలిత ఆస్తులకు వారసుడు ఎక్కడ..? ఇంకెందుకు ఆలస్యం.. సర్కారుకే ఇచ్చేయొచ్చుగా?

దివంగత సీఎం జయలలిత ఆస్తులు ఇక తమిళ రాష్ట్రానికే చెందుతాయా? ఆమెకు వారసులు లేకపోవడమే ఇందుకు కారణమా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నారు.. సామాజిక వేత్త భాస్కరన్. తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి, ద

దివంగత సీఎం జయలలిత ఆస్తులు ఇక తమిళ రాష్ట్రానికే చెందుతాయా? ఆమెకు వారసులు లేకపోవడమే ఇందుకు కారణమా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నారు.. సామాజిక వేత్త భాస్కరన్. తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత సీఎం జయలలిత మరణంలో మిస్టరీ, ఆపై చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు రోత పుట్టిస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో అమ్మ ఆస్తులకు వారసులు ఎవరు అనే అంశంపై సమాచార హక్కు చట్టం కింద భాస్కరన్ ఆరా తీశారు. అయితే అమ్మకు వారసులు లేకపోవడంతో ఆమె ఆస్తులు రాష్ట్ర ప్రభుత్వానికే దక్కే అవకాశం ఉన్నట్లు భాస్కరన్ తెలిపారు. అమ్మకు చట్టప్రకారం వారసుడు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. దీంతో జయమ్మ ఆస్తులు తమిళ రాష్ట్ర సర్కారుకే చెందాలని డిమాండ్ చేశారు. 
 
ఇప్పటి వరకు అమ్మ తన వారసులు ఎవరనే విషయాన్ని ఎక్కడా ప్రకటించలేదు. జయ ఆస్తులకు అధికారం కలిగిన వారసుల పేరు రిజిస్టర్ కూడా కాలేదు. రిజిస్టర్ ఆఫీసు నుంచి సచివాలయం వరకు అమ్మ ఆస్తులకు వారసులు లేరనే సమాధానం రావడంతో.. ఆమె ఆస్తులు ప్రభుత్వానికి దక్కేలా చర్యలు తీసుకోవాలని భాస్కరన్ డిమాండ్ చేశారు.