శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 29 జులై 2016 (11:39 IST)

పరువునష్టం కేసులో జయ సర్కారుకు సుప్రీం చెంపదెబ్బ!

పరువునష్టం కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సర్కారుకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వాన్ని విమర్శించారని డీఎండీకే అధినేత విజయకాంత్‌పై వేసిన అన్నాడీఎంకే తరపున న్యాయవాది ఒకరు దావాల

పరువునష్టం కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సర్కారుకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వాన్ని విమర్శించారని డీఎండీకే అధినేత విజయకాంత్‌పై వేసిన అన్నాడీఎంకే తరపున న్యాయవాది ఒకరు దావాలో దిగువ కోర్టు జారీచేసిన నాన్ బెయిలబుల్ వారంట్ల అమలును గురువారం సుప్రీంకోర్టు నిలిపేసింది. రాజకీయ ప్రత్యర్థులపై పరువునష్టం దావాలను ఒక ఆయుధంగా వినియోగించుకోరాదని హితవు పలికింది. 
 
ప్రజాస్వామ్య వ్యవస్థ ఆకాంక్షలు, భిన్నాభిప్రాయాలు, విమర్శలు, అసమ్మతి, సహనం వంటి ప్రాథమిక అంశాలతో కూడుకొన్నదని, తమకు నచ్చని అంశాలను ప్రజలు విమర్శల ద్వారానే వ్యక్తీకరిస్తారని పేర్కొంది. విమర్శలపట్ల సహనం వహించకుండా అదేపనిగా ప్రభుత్వం పరువునష్టం కేసులు వేయడం తగదని చెప్పింది. అసమ్మతి గొంతు నొక్కరాదని, ప్రభుత్వాన్ని, అధికారులను విమర్శించేవారిపై ఐపీసీలోని 499, 500 సెక్షన్ల కింద పరువు నష్టం కేసులు పెట్టడం కలవరపరిచే అంశమని వ్యాఖ్యానించింది.