గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 26 ఆగస్టు 2016 (14:57 IST)

మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులు: అరెస్ట్

ఓ మహిళా జర్నలిస్టుపై నలుగురు దుండగులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ మహిళా జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను పోలీ

ఓ మహిళా జర్నలిస్టుపై నలుగురు దుండగులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ మహిళా జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. తమ విధులు ముగించుకుని కెమెరా‌మెన్‌తోపాటు బాధిత మహిళ జర్నలిస్టు ఆఫీస్ కారులో ఇంటికి బయల్దేరారు. ఆ సమయంలో న‌లుగురు ఆకతాయిలు ఆమెను వెంబ‌డించారు. 
 
కాగా కారులో ఉన్న మహిళా జర్నలిస్టు పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే గాక ఆమె ఫొటోను తీసేందుకు ఆ వ్యక్తులు ప్రయత్నించారు. దీంతో ఆ మహిళా జర్నలిస్టు పోలీసులను ఆశ్రయించారు. అనంతరం  ఆమె ఈ వ్యవహారాన్నంతా త‌న ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది.  కేసు నమోదు చేసుకుని విచారణ జరిపిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఫోర్త్ ఎస్టేట్‌గా పిలవబడుతున్న జర్నలిస్టులకే రక్షణ లేనప్పుడు సాధారణ మహిళలకు రక్షణ ఎలా ఉంటుందని ఆమెను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.