శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 24 సెప్టెంబరు 2016 (09:57 IST)

ప్రియురాలు పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుందనీ...

ఢిల్లీలో ఓ ప్రేమికుడు దారుణానికి ఒడిగట్టాడు. ప్రియురాలు పెళ్ళి చేసుకోమని ఒత్తిడి చేయడంతో వంటింట్లో కత్తిని తీసుకుని కర్కశంగా పొడిచాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

ఢిల్లీలో ఓ ప్రేమికుడు దారుణానికి ఒడిగట్టాడు. ప్రియురాలు పెళ్ళి చేసుకోమని ఒత్తిడి చేయడంతో వంటింట్లో కత్తిని తీసుకుని కర్కశంగా పొడిచాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఢిల్లీ నగర శివారు ప్రాంతమైన సుల్తాన్ పూర్ మజ్రాకు చెందిన 24 ఏళ్ల రాహుల్ కళాశాలలో చదువుతూ మానివేశాడు. తాను ప్రేమించిన 18 ఏళ్ల ప్రియురాలు తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుందనే ఆగ్రహంతో రాహుల్ వంటింటి కత్తితో కర్కశంగా పొడిచాడు. 
 
కత్తిపోట్లకు గురైన బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి తరలించామని పోలీసు డిప్యూటీ కమిషనర్ విక్రంజిత్ సింగ్ చెప్పారు. నిందితుడైన రాహుల్ మంగోల్ పూరి చేపలమార్కెట్ వద్ద ఉన్నాడని స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు వెళ్లి అతన్ని అరెస్టు చేశారు.