బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2015 (19:44 IST)

నిర్భయ గ్యాంగ్ రేప్ కేసు దోషులకు మరో పదేళ్ళ జైలుశిక్ష

నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో దోషులుగా తేలిన వారికి ఢిల్లీ కోర్టు మరో పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ తాజాగా తీర్పునిచ్చింది. నిర్భయ సామూహిత అత్యాచార ఘటనకు ముందు ఈ కేసులో దోషులుగా తేలిన ముఖేష్, వినయ్, అక్షయ్, పవన్, రాంసింగ్‌‌లు ఓ కార్పెంటర్‌పై దాడికి దిగి అతడిని నిలువుదోపిడీ చేశారు. దీనిని ఢిల్లీ పోలీసులు సాక్ష్యాధారాలతో నిరూపించడంతో ఢిల్లీ అడిషనల్ సెషన్స్ న్యాయమూర్తి రితేష్ సింగ్ నిందితులు నలుగురికి ఒక్కక్కరికి విడివిడిగా పదేళ్ల జైలు శిక్ష విధించారు. 
 
కాగా, నిర్భయ కేసులో ఇప్పటికే వీరికి సెషన్స్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు మరణశిక్ష విధించగా, హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును వీరు ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు అపెక్స్ కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇదిలావుంచితే, నిర్భయ కేసులో ఒకడైన రాంసింగ్ తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీకి చెందిన 23 యేళ్ల పారామెడికల్ వైద్య విద్యార్థిని 2012 డిసెంబర్ 13వ తేదీన జుగుప్సాకరమైన రీతిలో గ్యాంగ్ రేప్‌కు గురైన తర్వాత 16 రోజుల పాటు మృత్యువుతో పోరాడి జీవన్మరణ పోరాటం చేసిన విషయంతెల్సిందే.