Widgets Magazine

పెళ్లి వద్దన్నాడు.. శృంగారానికి నిరాకరించాడు.. కూరగాయలు కోసే కత్తితో వాటిని కోసేసింది...

సోమవారం, 26 జూన్ 2017 (09:30 IST)

Widgets Magazine

ఢిల్లీలో ఓ అబల ఓ కామపిశాచికి తగిన శాస్తి చేసింది. నాలుగేళ్ల పాటు ప్రేమపేరుతో చెట్టాపట్టాలేసుకుని తిరిగి... ముద్దూముచ్చట తీర్చుకున్న యువకుడు తీరా పెళ్ళి మాటెత్తగానే వివాహం వద్దన్నాడు. దీంతో ఆగ్రహించిన ఆ యువతి... ఇంటికి పిలిచి శృంగారంలో పాల్గొనాలని అతడిని ఒత్తిడి చేసింది. అందుకు నిరాకరించడంతో కూరగాయలు కోసే కత్తితో జననాంగాలను కోసేసింది. ఢిల్లీ శివారు ప్రాంతమైన మంగోల్‌పురిలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఈ ప్రాంతానికి చెందిన చిరు వ్యాపారి రవి (35), నాలుగేళ్లుగా ఓ అమ్మాయిని ప్రేమించాడు. ముద్దూముచ్చట తీర్చుకున్నాడు. సినిమాలు, షికార్లంటూ ఢిల్లీ పార్కులు, వీధుల్లో తిరిగాడు. అయితే, బుధవారం ప్రియురాలి ఇంటికి వెళ్లిన ప్రియుడి వద్ద మాటల మధ్యలో పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది. 
 
పెళ్లికి తన కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదని, తాను పెళ్లి చేసుకోలేనని తెగేసి చెప్పాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రియురాలు రవిని బాత్‌రూములోకి తీసుకెళ్లి తనతో శృంగారం చేయాల్సిందిగా డిమాండ్ చేసింది. అందుకు అతడు నిరాకరించడంతో కూరగాయలు తరిమే కత్తితో జననాంగాలను కోసేసింది.
 
ఆ సమయంలో యువతి సోదరుడు, వదిన ఇంట్లోనే ఉన్నారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారు చూస్తూ ఉన్నారే తప్ప నిలువరించేందుకు ప్రయత్నించలేదని ఆరోపించాడు. ఘటన జరిగిన వెంటనే చుట్టుపక్కల వారు గమనించి అతడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. శస్త్రచికిత్స అనంతరం బాధితుడిని జైపూర్‌లోని గోల్డెన్ ఆస్పత్రికి తరలించారు.
 
సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని పరారైన నిందితురాలితో సహా ఆమె కుటుంబ సభ్యులను కూడా అరెస్టు చేశారు. నిందితురాలి నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

దేశవ్యాప్తంగా రంజాన్ సందడి... ప్రజలకు నేతల ఈద్‌ శుభాకాంక్షలు

దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పండుగను ముస్లిం సోదరులు ...

news

ఎంత మ్యాక్‌బెత్ స్టోరీ ఇష్టమైతే మాత్రం హోం వర్క్‌గా సూసైట్ లేఖ రాయమంటారా?

పాఠం చెప్పే టీచర్ తానేం చెబుతున్నదీ మర్చిపోతే విచక్షణ లేకుండా ఆ లండన్ టీచర్ చేసిన ...

news

ప్రజల గొప్పతనాన్ని దేశం ముందు చాటుతున్న మన్ కీ బాత్

ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న రేడియో ప్రసంగాల కార్యక్రమం మన్ కీ బాత్ -మనసులో మాట- ఆయనకు ...

news

తల్లి నేర్పాలనుకున్న గుణపాఠం.. పిల్లల ప్రాణాలనే హరీమనిపించింది..

తెలుగు సమాజంలో ఒక గజల్ గాయని నాలుగేళ్ల క్రితం గారాబంగా పెంచుకుంటున్న కుక్కను కారులో ...