శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 30 అక్టోబరు 2014 (11:50 IST)

సంఖ్యాబలం తక్కువగా ఉన్నా ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు : సుప్రీంకోర్టు

సంఖ్యా బలం తక్కువగా ఉన్నప్పటికీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చంటూ సుప్రీంకోర్టు గురువారం కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇది భారతీయ జనతా పార్టీ నేతల్లో ఆశలు రేకెత్తించింది. ఈ మేరకు ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయాలన్న ఆప్ పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 
 
ముఖ్యంగా ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి సూచన మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ చేస్తున్న ప్రయత్నాలను న్యాయస్థానం సమర్థించింది. ఆయన చర్యలు సానుకూలంగా ఉన్నాయని తెలిపింది. బయటి నుంచి ఎవరైనా మద్దతిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని పేర్కొంటూ కేసు విచారణను కోర్టు నవంబరు 11వ తేదీకి వాయిదా వేసింది.