శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 18 ఆగస్టు 2017 (13:31 IST)

మెట్రో రైలులో టెక్కీని వీడియో తీశాడు.. ఏం చేస్తున్నావని అడిగితే?

స్మార్ట్ ఫోన్ చేతిలో వుందని ఓ వ్యక్తి మెట్రో రైలులో ఓవరాక్షన్ చేశాడు. మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న మహిళను చిత్రీకరించాడు. పైగా స్మార్ట్‌ఫోన్‌లో తనను ఎందుకు చిత్రీకరిస్తున్నావని అడిగిన మహిళపైనే దాడికి

స్మార్ట్ ఫోన్ చేతిలో వుందని ఓ వ్యక్తి మెట్రో రైలులో ఓవరాక్షన్ చేశాడు. మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న మహిళను చిత్రీకరించాడు. పైగా స్మార్ట్‌ఫోన్‌లో తనను ఎందుకు చిత్రీకరిస్తున్నావని అడిగిన మహిళపైనే దాడికి దిగాడు. ఈ ఘటన దేశ రాజధాని నగరం ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. టెక్కీ అయిన 25 ఏళ్ల యువతి నోయిడా సెక్టార్  16 నుంచి అక్షర్‌ధామ్ వెళ్లేందుకు మెట్రో రైల్ ఎక్కింది. 
 
దాదాపు 40 ఏళ్లున్న ఓ వ్యక్తి ఆమెను తన సెల్ ఫోన్‌లో వీడియో తీశాడు. దాన్ని గమనించిన యువతి అతని సెల్ ఫోన్‌ను లాక్కునేందుకు ప్రయత్నించింది. ఏం చేస్తున్నావ్ అంటూ ప్రశ్నించింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి మహిళపై దాడి చేశాడు. అయితే తోటి ప్రయాణికుల సాయంతో అతడిని అదుపు చేసిన యువతి ఈ ఘటనపై యుమున బ్యాంక్‌ డిపో మెట్రో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 
 
యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడిని బీహార్‌‌లోని బెగుసరైకు చెందిన కుమార్‌గా పోలీసులు గుర్తించారు. పొగాకు ఉత్పత్తులను అమ్ముకునే కుమార్‌ తన బంధువులను కలిసేందుకు ఢిల్లీకి వచ్చాడు. ఇంకా టెక్కీని వీడియో తీసే సమయంలో కుమార్ పీకలదాకా మందేసివున్నాడని పోలీసులు తెలిపారు.