Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనీ... 25 సార్లు కత్తితో పొడిచాడు... ఎక్కడ?

ఆదివారం, 2 జులై 2017 (15:21 IST)

Widgets Magazine
murder

తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని 25 సార్లు కత్తితో పొడిచి దారుణంగా హత్యచేసిన నిందితుడిని ఢిల్లీ నగర పోలీసులు అరెస్ట్ చేశారు. గత శుక్రవారం ఈ దారుణ ఘటన ఈశాన్య ఢిల్లీలోని భజన్ పురాలో చోటుచేసుకోగా, తాజాగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... ఉత్తరప్రదేశ్ అలీఘడ్‌కు చెందిన వినోద్ కుమార్ (38) అనే వ్యక్తి స్థానిక భజన్‌పురాలో కుటుంబంతో సహా నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో 23 ఏళ్ల షాను అనే వ్యక్తి తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని వినోద్ అనుమానించాడు. షాను తరచుగా తన ఇంటి చుట్టుపక్కల ఉండటాన్ని గమనించాడు. 
 
గత శుక్రవారం కూడా అదేవిధంగా తన ఇంటి ముందు తచ్చాడుతుండగా షానును ఇంట్లోకి పిలిచాడు. షాను మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్న వినోద్.. ఒక్కసారిగా షాను మీద కత్తితో దాడికి దిగాడు. వినోద్ ఇంట్లో ఉన్న ఓ మైనర్ బాలుడు షానును వెనుకనుంచి గట్టిగా పట్టుకోగా.. నా భార్యను ప్రేమిస్తూ, ఆమెతో సంబంధం పెట్టుకుంటావా? బిగ్గరగా అరుస్తూ షానును కత్తితో 25 సార్లు పొడిచాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆ విమానం ఎక్కుతున్నారా... అయితే చేతిలో గొడుగు పట్టుకెళ్లండి... (Video)

సాధారణంగా వర్షాకాలంలో ఇంటి పైకప్పు నుంచి వర్షపు నీరు వెలుస్తూ ఉంటుంది. ఇదే పరిస్థితి ...

news

నిజాయితీగా విధులు నిర్వహించింది.. వారం తిరక్కుండానే బదిలీ.. ఎక్కడ?

నిజాయితీగా, ధైర్యంగా విధులు నిర్వహించిన ఓ మహిళా పోలీసు అధికారిణికి సరిగ్గా వారం రోజులు ...

news

బ్లూ ఫిల్మ్ అంటే ఏంటో తెలుసా? ఎపుడైన చూశారా? ప్రజలను ప్రశ్నించి సీఎం..

ఇటీవలి కాలంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిత్యం వివాదాల్లో చిక్కుకుని ...

news

చివరకు పంచె మాత్రమే మిగులుతుంది : వెంకయ్య నాయుడు చురకలు

"ఆస్తిని, సంప‌ద‌ను పెంచ‌కుండా పంచితే చివ‌రికి నీకు మిగిలేది పంచె మాత్ర‌మే"న‌ని కేంద్ర ...

Widgets Magazine