Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. మనస్పర్ధలతో విడిపోయాడు.. సర్‌ప్రైజ్ ఇస్తానని గొంతు కోశాడు..

సోమవారం, 19 జూన్ 2017 (09:09 IST)

Widgets Magazine

ప్రేమతో వంచించే ఉన్మాదులు ఎక్కువైపోతున్నారు. ప్రేమ పేరుతో మోసం చేస్తున్నారు. ఆపై హత్యలు చేసేందుకూ వెనుకాడట్లేదు. తాజాగా ఓ ఉన్మాది ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యను గొంతు నులిమి చంపేశాడు. మొన్నటికి మొన్న బెంగళూరులో భార్యతో ఏర్పడిన మనస్పర్ధల కారణంగా స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మరవక ముందే భార్యకు మనస్పర్ధలతో దూరమైన ఓ భర్త.. చాలారోజుల తర్వాత ఆమెను కలిసి నమ్మించి గొంతుకోశాడు. ఈ ఘటన ఢిల్లీలోని బోంటా పార్కులో శుక్రవారం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే..  మనోజ్‌కుమార్‌(24) అనే వ్యక్తి తన భార్య కోమల్‌(22) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ మనస్పర్థలతో భార్యకు మనోజ్ దూరమయ్యాడు. చాలాకాలం తర్వాత ఆమెను కలిశాడు. తాను మారిపోయానని, సర్‌ప్రైజ్‌ ఇస్తానని, కళ్లు మూసుకొమ్మని అన్నాడు. ప్రేమగా భర్త చెప్పిన మాటలు నమ్మి.. కళ్లు మూసుకోగానే వైరుతో గొంతు బిగించి చంపేశాడు.
 
పార్కుకు తీసుకెళ్లి సర్‌ప్రైజ్ ఇస్తామని మనోజ్‌కుమార్‌(24) భార్యను హతమార్చాడు. భార్యను హతమార్చేందుకు మనోజ్ కుమార్ స్నేహితుడి సాయం కోరాడు. కానీ అతడు వెంటనే పోలీసులకు ఫోన్ చేయడంతో కొద్ది గంటల్లోనే కేసు నమోదు చేసుకుని మనోజ‌్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే మనోజ్ భార్య కోమల్‌ను మాత్రం రక్షించలేకపోయారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మూడు పెళ్లిళ్లు... ఇద్దరితో 'ఆ' బంధం.. పోలీసులకే బెదిరింపులు.. ఆపై ఆత్మహత్యాయత్నం

గుంటూరు జిల్లాకు చెందిన ఓ మహిళ ఒకరికి తెలియకుండా మరొకరితో ఏకంగా ముగ్గురిని వివాహం ...

news

అడవుల్లో మంటలు.. రోడ్లపై కార్లు.. 20 కి.మీ. పొడవునా కార్చిచ్చు.. మాడి మసైన ప్రయాణికులు

పచ్చని పైన్, యూకలిప్టస్‌ చెట్లతో సుందరంగా కనిపించిన వనాలు శ్మశానాలుగా దర్శనమిస్తే.. 20 ...

news

మద్యం మత్తులో జోగుతుంటే.. దెయ్యం పట్టిందని.. చేతులు కాల్చేశారు..

మద్యం మత్తులో జోగుతున్న మహిళకు దెయ్యం పట్టిందని నిప్పులు పట్టించిన ఘటన కొత్తగూడెం ...

news

క్యూబాతో బ్రేకప్.. ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. హైజాకర్లు, ఉగ్రవాదులను కాపాడింది..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనం నిర్ణయం తీసుకున్నారు. బరాక్ ఒబామా ...

Widgets Magazine