గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2017 (10:08 IST)

ముందర కాళ్ళకు బంధం : దినకరన్‌పై ఢిల్లీ పోలీసుల లుక్‌అవుట్ నోటీసులు!

అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ ముందరకాళ్ళకు బంధం పడింది. దినకరన్‌పై ఢిల్లీ పోలీసులు లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన దేశ విదేశాలకు పారిపోకుండా

అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ ముందరకాళ్ళకు బంధం పడింది. దినకరన్‌పై ఢిల్లీ పోలీసులు లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన దేశ విదేశాలకు పారిపోకుండా చర్యలు తీసుకున్నట్టయింది. 
 
అన్నాడీఎంకే అధికారిక ఎన్నికల గుర్తు రెండాకులను తిరిగి తమ సొంతం చేసుకునేందుకు ఎన్నికల సంఘం అధికారికి రూ.60 కోట్ల మేరకు లంచం ఇవ్వబోయినట్టు ఆరోపణలు రావడంతో దినకరన్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే టీటీవీ దినకరన్‌పై ఢిల్లీ పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. దేశం విడిచి వెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఢిల్లీ జాయింట్ కమిషనర్ వెల్లడించారు. 
 
ఈ కేసులో పట్టుబడిన కీలక నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ ద్వారా పోలీసులు మరింత లోతుగా సమాచారం రాబడుతున్నారు. ఈయన వద్ద రూ.1.30 కోట్ల నగదును కూడా ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ కేసులో ఇంకా ఎంతమంది ప్రమేయం ఉందీ.. దినకరన్ తన చుట్టూ ఏర్పాటు చేసుకున్న నెట్‌వర్క్ ఎంతవరకు విస్తరించింది అనే దానిపై కీలక ఆధారాలు రాబట్టినట్టు చెబుతున్నారు.