బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 8 డిశెంబరు 2016 (20:34 IST)

బ్యాంకుల్లో డబ్బులేసి వైట్ అయ్యిందనుకోవద్దు... లెక్కచూసి తాట తీస్తాం.. జైట్లీ హెచ్చరిక

పెద్ద నోట్లను రద్దు చేసి నేటితో నెల రోజులు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాతో పలు విషయాలు వెల్లడించారు. దేశం డిజిటల్ లావాదేవీల బాటలో పయనిస్తోందని చెప్పారు. ఈ లావాదేవీలు 20 నుంచి 40 శాతం పెరిగినట్లు వెల్లడించారు. ఇకపోతే పాతనోట్లను

పెద్ద నోట్లను రద్దు చేసి నేటితో నెల రోజులు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాతో పలు విషయాలు వెల్లడించారు. దేశం డిజిటల్ లావాదేవీల బాటలో పయనిస్తోందని చెప్పారు. ఈ లావాదేవీలు 20 నుంచి 40 శాతం పెరిగినట్లు వెల్లడించారు. ఇకపోతే పాతనోట్లను పెద్ద మొత్తంలో బ్యాంకుల్లో వేసేసి అదంతా వైట్ మనీ అయిపోయిందని అనుకోవద్దనీ, బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన సొమ్ము ఎక్కడిదో లెక్కలు చూపాలని హెచ్చరించారు. లెక్కలు చూపనట్లయితే ఆ డబ్బుకు ఫైన్ వేస్తామని తెలియజేశారు.
 
ఇకపోతే డబ్బుతో లావాదేవీలు కాకుండా క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించేవారికి పలు సౌకర్యాలను కల్పించనున్నట్లు తెలిపారు. డీజిల్ కొనుగోలు చేసేవారికి 0.7 శాతం డిస్కౌంట్ ఉంటుందన్నారు. ఆన్ లైన్ ద్వారా రైల్వే రిజర్వేషన్ చేసుకునేవారికి రూ.10 లక్షల జీవిత బీమా ఉచితమని తెలిపారు. ఇలా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ పన్నులను తగ్గించడమే తమ లక్ష్యమన్నారు. నోట్ల రద్దుతో దీర్ఘకాల ప్రయోజనాలు ఉంటాయనీ, ఇప్పటికిప్పుడు ప్రయోజనాల గురించి చెప్పడం సాధ్యం కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.