గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 30 నవంబరు 2016 (12:16 IST)

పెద్దనోట్ల రద్దుపై రాందేవ్ మాట: చేదుమాత్రే.. కానీ ఆర్థిక వ్యవస్థకు ఆరోగ్యవంతమే

పెద్ద నోట్ల రద్దుపై ప్ర‌ముఖ యోగాగురు రామ్‌దేవ్ బాబా కూడా సానుకూలంగా స్పందించారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు ప్ర‌జ‌ల‌కు ఓ చేదుమాత్ర లాంటిదేన‌ని, అయితే దీర్ఘ‌కాలంలో భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ఆరోగ్య‌వంత‌మైన ప్ర‌

పెద్దనోట్ల రద్దుపై విభిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. నల్లధనాన్ని నిరోధించడానికి, అవి నీతిని అంతమొందించడానికి పెద్ద నోట్ల రద్దు నిర్ణయా న్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్‌‌సరాజ్ గంగారాం అహిర్ చెప్పారు. నల్ల వ్యాపారాన్ని అరికట్టడంవల్ల అభివృద్ధికి, సంక్షేమ పథకాల అమలుకు చాలా అవకాశం వచ్చిందన్నారు. నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి, కొత్తగా ఉద్యోగ అవకాశాలు రావడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. నోట్ల రద్దుతో కశ్మీర్‌లోనూ ఉగ్రవాదం తగ్గిపోతుందన్నారు.
 
ఈ నేపథ్యంలో పెద్ద నోట్ల రద్దుపై ప్ర‌ముఖ యోగాగురు రామ్‌దేవ్ బాబా కూడా సానుకూలంగా స్పందించారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు ప్ర‌జ‌ల‌కు ఓ చేదుమాత్ర లాంటిదేన‌ని, అయితే దీర్ఘ‌కాలంలో భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ఆరోగ్య‌వంత‌మైన ప్ర‌భావం చూపుతుంద‌ని వ్యాఖ్యానించారు. కానీ పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బంది ప‌డుతున్న మాట వాస్తవమేనన్నారు. పెద్ద‌నోట్ల ర‌ద్దుకు వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్షాలు భార‌త బంద్‌కు పిలుపు ఇచ్చినా ప్ర‌జ‌లు మాత్రం ప్ర‌భుత్వ నిర్ణయానికే మ‌ద్ద‌తు ప‌లికార‌న్నారు. ప్ర‌ధాని సాహ‌సోపేత నిర్ణయానికి ప్ర‌జ‌లు అండ‌గా నిలిచార‌ని రామ్‌దేవ్ బాబా వెల్లడించారు.