గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 13 అక్టోబరు 2015 (14:03 IST)

బీజేపీతో శివసేన కటీఫ్ : సేన ఎమ్మెల్యేలు రాజీనామా..?

మహారాష్ట్రలో అధికార పార్టీ బీజేపీతో శివసేన తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. మహారాష్ట్రలో రచయితలపై జరుగుతున్న దాడుల కారణంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సర్కారుతో శివసేన కటీఫ్‌కు సిద్ధమనైట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా శివసేన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసేందుకు కూడా సన్నద్ధమైనట్లు సమాచారం. 
 
పాకిస్థాన్ అంతేనే మండిపడుతున్న శివసేన.. ఆ దేశానికి చెందిన కళాకారులను ఎట్టిపరిస్థితుల్లోనూ భారత్‌లో అడుగుపెట్టించేది లేదంటోంది. సోమవారం ఒకప్పటి బీజేపీ సిద్ధాంతకర్త, రచయిత సుధీంద్రకులకర్ణిపై దాడి జరిగింది. దీన్ని బీజేపీ ఖండిస్తున్నట్లు తెలియరావడంతో పాటు ఫడ్నవీస్ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉండటంతో శివసేన విడిపోవాలనుకుంటుంది. 
 
ఫడ్నవీస్ ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తి కలిగివుండటంతో భవిష్యత్తులో శివసేనకు నష్టమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అంతేగాకుండా మున్సిపల్ ఎన్నికలను టార్గెట్ చేసే శివసేన బీజేపీతో సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలని భావిస్తోంది. ఇక శివసేన నిర్ణయంతో మహారాష్ట్ర రాజకీయాల్లో సంక్షోభం తలెత్తే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.