శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 1 నవంబరు 2014 (12:43 IST)

మహారాష్ట్ర బీజేపీ తొలి సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణం

మహారాష్ట్ర బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలో ప్రజలతో క్రిక్కిరిసిన వాంఖడే స్టేడియంలో ఫఢ్నవిస్ ఆ రాష్ట్ర సీఎంగా ప్రమాణం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు ఫడ్నవిస్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 
 
ఫడ్నవిస్ మరాఠీ భాషలో ప్రమాణ చేయగా, ఆయన తర్వాత పలువురు మంత్రులు, సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ నేత ఎల్ కె అద్వానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శివసేన నేత ఉద్ధవ్ థాకరే, పలువురు కేంద్ర మంత్రులు, ముఖేష్ అంబానీ, రతన్ టాటా, ఆది గోద్రెజ్, అమితాబ్ బచ్చన్, లతా మంగేష్కర్, సల్మాన్ ఖాన్ వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.