శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 30 అక్టోబరు 2014 (21:11 IST)

రేపే మహా సీఎం ప్రమాణం... ఎన్సీపీ తిడుతోంది... శివసేన రాదట...

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ రేపే ప్రమాణ స్వీకారోత్సవం చేయబోతున్నారు. ఐతే ఈ ప్రమాణ స్వీకారోత్సవం రోజున శివసేన పార్టీ నేతలెవరూ ప్రమాణం చేసే అవకాశం లేదని, రేపు ప్రాథమికంగా ప్రకటించే క్యాబినెట్లో శివసేన నేతలకు చోటు కల్పించడం లేదని బీజేపీ జనరల్ సెక్రెటరీ రాజీవ్ ప్రతాప్ రూడీ చెప్పారు. దీనిపై శివసేన ఏమీ మాట్లాడలేదు కానీ ఎన్సీపీ బయటినుంచి ఇస్తామన్న మద్దతును మహారాష్ట్ర అభివృద్ధి కోసం పరిశీలిస్తున్నామన్నట్లు ఆయన తెలిపారు.
 
ఐతే మద్దతు ఇస్తామన్న ఎన్సీపీ అప్పుడే భాజపాపై విమర్శల దాడి చేస్తోంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో ఆర్భాటం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడింది. మహారాష్ట్ర చరిత్రలోనే ప్రమాణ స్వీకారం కోసం బీజేపీ పెద్ద ఎత్తున ధనాన్ని వెచ్చిస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి విమర్శించారు. మొత్తమ్మీద మహారాష్ట్రలో భాజపా వ్యవహారం రకరకాల మలుపులు తిరుగుతోంది.