Widgets Magazine

అల్లుడూ ఆవేశం వద్దు... దేవుడు శాసిస్తాడు నేను వస్తాను... అల్లుడికి కూడా రజినీ సేమ్ డైలాగ్...

సోమవారం, 3 జులై 2017 (15:59 IST)

Widgets Magazine
rajinikanth

ధనుష్‌.. సినిమాల్లో కనిపించనంత కఠువుగా కాకుండా మృదు స్వభావి. మామ రజినీకాంత్‌గా తన పనేదే తాను చేసుకుపోతుంటాడు. అనుకున్న సమయానికి షూటింగ్‌కు రావడం.. షూటింగ్ అవ్వగానే ఇంటికి వెళ్ళిపోవడం ఇది ధనుష్‌కు అలవాటు. స్నేహితులని, షికార్లని ఎప్పుడూ టైం వేస్టు చేయకుండా మామను ఫాలో అవుతారు ధనుష్. అందుకే రజినీకాంత్ తన కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు. మామ, అల్లుళ్ళ మధ్య మంచి సఖ్యతే ఉంది. రజినీకాంత్ అంటే ధనుష్‌కు ఎంతో గౌరవం. తండ్రితో సమానంగా ఆయన్ను చూస్తుంటారు. 
 
అయితే ఈ మధ్య కాలంలో రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై వార్తలు రావడం.. రజినీకి రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఉన్న విషయం తెలిసిందే. అయితే తమిళర్ మున్నేట్ర పడై, నామ్ తమిళర్ పార్టీలు రజినీ రాజకీయాల్లోకి రాకూడదని రాద్దాంతం చేయడం.. ఆ తరువాత కొంతమంది సినీ ప్రముఖులు రజినీ స్థానికుడు కాదు. ఆయకు రాజకీయాలు ఏం తెలుసునని దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేయడం ఇదంతా ధనుష్‌ గమనిస్తూనే ఉన్నాడు. 
 
ఎప్పుడూ కూడా బయటకు వచ్చి ఎవరితోను మామ రాజకీయాల గురించి గానీ వేరే విషయాల గురించి ధనుష్ మాట్లాడనే లేదు. కానీ రాజకీయాల గురించి రజినీ కుటుంబ సభ్యులందరితో కలిసి చర్చించి నిర్ణయానికి వచ్చారు. కానీ రజినీపై విమర్శలు ఎక్కువ కావడంతో ధనుష్‌ సహనం కోల్పోయారట. రెండురోజుల క్రితం రజినీతో సుధీర్ఘంగా మాట్లాడారట ధనుష్. 
 
మామా మీరు అనుకున్న విధంగా రాజకీయాల్లోకి రండి. ఎవరు అడ్డొస్తారో నేను చూస్తాను. ప్రజలకు సేవ చేయండి.. ఇదంతా మామూలే. ఎవరైనా మంచి పనిచేస్తే చాలామందికి ఒప్పదు అంటూ రజినీకి చెప్పారట. ఇప్పటివరకు ఎప్పుడు కూడా రజినీతో ఇంతసేపు ధనుష్ మాట్లాడిన సంధర్భాలు లేవని కుటుంబ సభ్యులే చెప్పుకుంటున్నారు. అలాంటిది రాజకీయాల గురించి రజినీతో ధనుష్ మాట్లాడటంతో రజినీ ఆవేశపడకుండా మెల్లగా సమాధానం ఇచ్చాడట. అన్నింటికీ ఒక సమయం ఉంటుంది. అప్పుడు దేవుడు శాసిస్తాడు... నేను పాటిస్తాను.. అంతవరకు సంయమనం పాటిద్దామంటూ చెప్పుకొచ్చారట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Dhanush Rajinikanth Tamilnadu Political Entry

Loading comments ...

తెలుగు వార్తలు

news

'నాకంటే చిన్నోడివిరా' అంటూ వారించినా వినలేదు - ప్రేమ.. గర్భం... మోసం : యువతి మౌనపోరాటం

'వయసులో నాకంటే చిన్నోడివిరా... నన్ను ప్రేమించవద్దు... ప్లీజ్‌రా వద్దు' అని చెప్పినా.. ఆ ...

news

భారత్ - చైనాల మధ్య యుద్ధం తథ్యమా? సరిహద్దుల్లో ఇరుదేశాల సైనికుల తోపులాట (Video)

భారత, చైనాల మధ్య యుద్ధం అనివార్యమయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే సరిహద్దుల్లో ఇరు దేశాల ...

news

రోజాను అలా అనడం బాగాలేదు... ముద్దన్నకు చెప్పండి... కేసీఆర్ వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే రోజాను సీనియర్ తెదేపా నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు విమర్శించడం ...

news

పద్మనాభుని సొమ్ము దోచేస్తున్నారు... స్వామి నామంలో 8 వజ్రాలు చోరీ...

కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో లక్ష కోట్ల విలువ చేసే బంగారు, వజ్ర వైఢూర్యాలు ...