Widgets Magazine

శశిథరూర్ మూడో పెళ్లి చేసుకోబోతున్నారా?

ఆదివారం, 12 ఆగస్టు 2018 (16:41 IST)

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శశిథరూర్ తిలోత్తమ ముఖర్జీ, సునందా పుష్కర్‌లనూ గతంలో పెళ్లాడారు. సునంద అనుమానాస్పద మరణం కేసులో థరూర్ పేరును ఢిల్లీ పోలీసులు చార్జ్ షీట్‌లో చేర్చారు. ఈ నేపథ్యంలో శశిథరూర్ పాకిస్థాన్ జర్నలిస్ట్ మెహ్ర్‌తరార్‌ను వివాహం చేసుకోనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే ఆమెను పెళ్లాడనున్నట్లు సీఎన్ఎన్ న్యూస్ 18 పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
shashi tharoor
 
అయితే ఇది సదరు టీవీ చానెల్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ కాదని తేలింది. కేవలం శశిథరూర్, తరార్‌ల వివాహంపై వార్త రాగానే ముందువెనుక చూసుకోకుండా 66 మంది ఫాలోకావడం మొదలుపెట్టారు. ఈ ట్వీట్ ఇంటర్నెట్‌లోనూ వైరల్‌గా మారింది. చివరికి మెహ్ర్ ఈ వ్యవహారంపై స్పందించారు. 
 
ఈ వ్యవహారంలో ఓ పేరడీ అకౌంట్లో వచ్చిన తప్పుడు కథనానికి ఎలా నమ్మేస్తారంటూ ప్రశ్నించారు. కొన్ని రోజుల క్రితమే ప్రారంభించిన ఈ అకౌంట్‌కు కేవలం 66 మంది ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. ఇలాంటి నకిలీ వార్తలను ప్రజలు నమ్మేయడం ఆశ్చర్యం కలిగిస్తుందని ట్వీట్ చేశారు. దీంతో కేసులు పడొచ్చని భయపడ్డ సదరు ట్విట్టర్ అకౌంట్ యూజర్ తనది కేవలం పేరడీ ఛానల్ మాత్రమేనని స్పష్టం చేశాడు.
 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

విషమంగా లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ ఆరోగ్య పరిస్థితి

లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా వుంది. లోక్‌సభ మాజీ స్పీకర్ ...

news

కేరళ వరదలు.. పిల్లాడి నెత్తుకుని పరుగులు.. నెట్టింట హీరోకు ప్రశంసలు

కేరళ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 37 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని ...

news

జగన్‌కు ముద్రగడ సవాల్.. జనసేన పార్టీ పల్లకీనే మోస్తారా?

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాపు నేత ముద్రగడ పద్మనాభం ...

news

పెళ్లికి ముందే మైనర్ బాలికకు వేరే వ్యక్తితో సంబంధం.. భర్తను అలా..?

మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. వివాహేతర సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. భార్యాభర్తల ...

Widgets Magazine