గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 1 డిశెంబరు 2015 (18:17 IST)

నిజమైన చెత్త రోడ్లపై లేదు... ప్రజల మనసుల్లో ఉంది: ప్రణబ్ ముఖర్జీ

స్వచ్ఛ భారత్ అంటే కేవలం పరిశుభ్రమైన భారత్ మాత్రమే కాదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. జాతిపిత మహాత్మా గాంధీ ఉద్దేశంలో స్వచ్ఛ భారత్ అంటే స్వచ్ఛమైన మనసు, వాతావరణం అని చెప్పారు. 
 
భారత్ అహింస అనే సూత్రం ఆధారంగా ఏర్పడిందని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సబర్మతీ ఆశ్రమంలో జరిగిన 62వ గుజరాత్ విద్యాపీట్ స్నాతకోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ప్రణబ్ తెలిపారు. ప్రజల్లో అసహనం గురించి మాట్లాడుతూ, దేశంలో నిజమైన చెత్త రోడ్లపై లేదని... ప్రజల మనసుల్లో ఉందని అన్నారు. 
 
సమాజాన్ని విభజించే భావజాలాన్ని మన మనసుల్లోంచి తీసివేసేందుకు ఇష్టపడకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. దేశం సంఘటితంగా ఉండాలని గాంధీ కలలు కన్నారని ఈ సందర్భంగా చెప్పారు. ప్రజలంతా సమానమేనని, అనందంగా ఉండాలని, మనుషులపై ఒకరికొకరికి నమ్మకం ఉండాలని కోరారు.