ప్రాణాలను ఎలా రక్షించుకోవాలో చెప్తానని ప్రాణాన్నే తీసేశాడు...(Video)

శుక్రవారం, 13 జులై 2018 (10:40 IST)

మహిళలపై అత్యాచారాలు, దురాగతాలు జరుగుతూనే వున్నాయి. తమిళనాడులో ఓ ట్రైనర్.. విద్యార్థినిని రెండో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, కోయంబత్తూరులోని ఓ కాలేజీలో నిర్వహించిన మాక్ డ్రిల్, ఓ విద్యార్థిని నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా బయట పడాలనే విధానాన్ని ఆ మాస్టర్ పిల్లలకు నేర్పుతున్నాడు. 
 
ఈ మేరకు డ్రిల్ మాస్టర్ కళైమగన్ ఆర్ట్స్ కళాశాలలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కింద విద్యార్థులంతా ఓ నెట్ పట్టుకుని నిల్చుండగా, రెండో అంతస్తు నుంచి లోకేశ్వరి అనే విద్యార్థిని కిందకు దూకేందుకు అంగీకరించింది. ఆపై రెండో అంతస్థు నుంచి ఆమె దూకేందుకు అనుమానిస్తుండగానే.. ట్రైనర్ ఆమెను దూకేయాల్సిందిగా ప్రోత్సహించాడు. 
 
లోకేశ్వరి భయపడుతుంటే కిందకు నెట్టేశాడు. కింద పడుతున్న సమయంలో ఆమె తల మొదటి అంతస్తుకు ఉన్న సన్ షేడ్‌కు బలంగా తాకింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ట్రైనర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
 దీనిపై మరింత చదవండి :  
డ్రిల్ మాస్టర్ కళైమగన్ ఆర్ట్స్ కళాశాల లోకేశ్వరి Wrong Girl Safety Drill Tamilnadu Disaster Management Training Coimbatore College

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఇంటికి పిలిచి కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి అత్యాచారం

విజయవాడ కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని టేనర్‌పేట అడ్డరోడ్డులో జరిగిన ఘటన సినిమా ...

news

నమ్మించి తీసుకెళ్లి - మత్తుమందిచ్చి అత్యాచారం... ఎక్కడ?

ఓ యువతిని నమ్మించి తన వెంట తీసుకెళ్లి ఆ తర్వాత మత్తుమందిచ్చి అత్యాచారం చేసిన ఘటన ఒకటి ...

news

ఆయన ఉంపుడుగత్తెల్లో భారతీయ మహిళలే ఎక్కువ : ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ మరోమారు తన మాజీ భర్తను ...

news

దేవుడు చెప్పాడనీ... గర్భగుడిలో యువతితో పూజారీ...

ఆలయానికి వచ్చిన ఓ మహిళా భక్తురాలి పట్ల పూజారి అసభ్యంగా నడుచుకున్నాడు. తనకు దేవుడు కలలో ...