Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పోయెస్ గార్డెన్ నుంచి శశి చుట్టాలందరూ వెళ్ళిపోండి.. దీపతో పన్నీర్ రెఢీ.. చిన్నమ్మ కసి తీర్చుకుంటుందా?

బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (13:13 IST)

Widgets Magazine

చిన్నమ్మ శశికళ జైలుకెళ్లిపోయింది.. ఇక ఆపద్ధర్మ సీఎంగా పన్నీర్ సెల్వం పనికానిస్తున్నారు. అన్నాడీఎంకే నుంచి అలాగే పోయెస్ గార్డెన్ నుంచి చిన్నమ్మ కుటుంబ సభ్యులను కూడా పంపించే దిశగా పన్నీర్ సెల్వం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. శశికళను వ్యతిరేకించే వారందరికీ ఆపన్న హస్తం అందిస్తున్నారు. అందులో భాగంగానే శశికళను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న జయలలిత మేనకోడలు దీపకు పన్నీర్ సెల్వం అండగా నిలిచారు.
 
మంగళవారం సాయంత్రం దీపతో కలిసి జయలలిత సమాధి వద్దకు నివాళులర్పించడానికి పన్నీర్ సెల్వం వెళ్లారు. ఈ పరిణామంతో అటు దీప వర్గం, ఇటు పన్నీర్ వర్గం హర్షం వ్యక్తం చేశారు. అన్నాడీఎంకేలో కూడా దీపకు కీలక బాధ్యతలు అప్పగించాలని పన్నీర్ భావిస్తున్నారు. 
 
అలాగే దీప జయకుమార్ కూడా పన్నీర్ వర్గంలో చేరడంతో సెల్వం ఇంటి ముందు రాత్రికి రాత్రే బ్యానర్లు కటౌట్లు వెలశాయి. ఆ బ్యానర్లపై ఎంజీఆర్, జయలలిత, పన్నీర్ సెల్వం, దీప ఫోటోలను ముద్రించారు. ప్రస్తుతం పన్నీర్ ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. ఆయన మద్దతుదారులు భారీ సంఖ్యలో ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. అయితే చిన్నమ్మ మాత్రం మన్నార్ గుడి మాఫియాతో పన్నీర్‌ను టార్గెట్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎమ్మెల్యేలను చీల్చేసిన చిన్నమ్మ.. తనను జైలుకు పంపించిన పన్నీరుపై కసి తీర్చుకునేందుకు అమ్మ సమాధిపై శపథం చేసినట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తోంది. 
 
మరి చిన్నమ్మను వారి వర్గీయులను పన్నీర్ సెల్వం ఎలా డీల్ చేస్తారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ముందులా దూకుడుగా వ్యవహరిస్తారా? లేకుంటే బలపరీక్షలో శశి వర్గీయులను పోతే పోనీ అని వదిలి పెట్టి మౌనం వహిస్తారా? అనేది తెలియాలంటే బల నిరూపణ వరకు ఆగాల్సిందే. ఇకనైనా ఇన్‌ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్... తమిళ రాజకీయ సంక్షోభానికి తెరదించితే బాగుంటుంది..!Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Dmk Convenes Panneerselvam Deepa Sasikala Emergency Meeting

Loading comments ...

తెలుగు వార్తలు

news

అధికారంలోకి డీఎంకే వస్తుందా..? ఎమ్మెల్యేలతో స్టాలిన్ భేటీ ఎందుకు.. పన్నీర్‌కు కన్నీరేనా?

తమిళనాట రాజకీయ పరిణామాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ...

news

దినకరన్‌కు పార్టీ పదవి... చీలిక దిశగా అన్నాడీఎంకే ... పన్నీర్ సారథ్యంలో అమ్మ డీఎంకే

అన్నాడీఎంకే అడుగులు చీలిక దిశగా పడుతున్నాయి. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళకు ...

news

ప్రేయసికి కొత్త కారు.. ఆపై దానిని 2వేల రూపాయలతో అలకరించాడు.. కానీ జైలుకెళ్లాడు..

ప్రేమికుల రోజున ఓ ప్రేమికుడు ప్రియురాలికి మదిలో నిలిచిపోయే కానుక ఇవ్వాలనుకుని ...

news

అమ్మ సమాధిపై శశి ''శపథం'': పన్నీర్ సెల్వమే టార్గెట్.. సీఎం పదవి కూడానా? ఏమై వుంటుంది?

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ అక్రమాస్తుల తీర్పుతో జైలు శిక్ష ...

Widgets Magazine