Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కుదిరితే అధికారం.. లేదంటే మధ్యంతరమే.. డీఎంకే ఆచితూచి అడుగులు

గురువారం, 16 ఫిబ్రవరి 2017 (09:10 IST)

Widgets Magazine
stalin

తమిళనాడు రాష్ట్రంలోని అధికార అన్నాడీఎంకేలో ఏర్పడిన అంతర్గత సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని విపక్షమైన డీఎంకే వ్యూహాలు రచిస్తోంది. అన్నాడీఎంకే కుమ్ములాటలు తమకు కలిసి వస్తే అధికారం చేపట్టాలని లేనిపక్షంలో మధ్యంతర ఎన్నికల కోసం వెళ్లాలని భావిస్తోంది. ఆ దిశగానే డీఎంకే నేతలు వ్యూహాలు రచిస్తూ ఆచితూచి అడుగులు వేస్తోంది. 
 
ఒకవేళ అన్నాడీఎంకేలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరినట్టయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంకు మద్దతు ఇవ్వడం కంటే... రిసార్ట్స్‌లో ఉన్న కొందరిని తమవైపు తిప్పుకోవాలని భావిస్తోంది. తద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చన్నది ఆ పార్టీ భావన. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అతిగా ముందుకు వెళ్లడం మంచిది కాదన్నది పలువురు సీనియర్ నేతల సలహా. 
 
మరోవైపు.. పన్నీర్‌ శిబిరంలో పది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండగా... అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా శశికళ ఎంపిక చేసిన పళనిస్వామి శిబిరంలో 124 మంది ఎమ్మెల్యే ఉన్నారు. డీఏంకేకి 89తో పాటు మిత్రపక్షాల నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఎవరికీ మద్దతిచ్చే ప్రసక్తి లేదని స్టాలిన్‌ ప్రకటించినా... పళనిస్వామిని సీఎం పీఠంపై కూర్చోనివ్వకూడదనేది డీఏంకే ముందున్న ప్రధాన లక్ష్యం. దీంతో కువత్తూరు రిసార్ట్స్‌ నుంచి తక్షణం 20 మంది ఎమ్మెల్యేలను తీసుకురాగలిగితే పన్నీర్‌కు మద్దతిచ్చి పళనిని నిరోధించాలని డీఎంకే భావిస్తోంది.
 
కనీసం 10 మందిని తీసుకురాగలిగితే పన్నీర్‌ వద్ద ఉన్న మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతుతో 118 మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పావులు కదుపుతోంది. ఇందుకోసం పార్టీ సీనియర్లకు మంత్రి పదవులు ఆఫర్‌ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. డీఎంకే మద్దతుతో పన్నీర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్, కేంద్రం సుముఖంగా లేని పక్షంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీఏంకే పాచికలు ఫలిస్తే సీఎం పీఠం, లేదంటే ఆరు నెలల్లో ఎన్నికలు తప్పనిసరి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంవ్యక్తం చేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పెళ్లైన ప్రియుడిని అక్రమ సంబంధం పెట్టుకోమని బెదిరించింది.. చంపేశాడు..

పెళ్లయ్యాక ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకోమని బెదిరించిన యువతిని ఆమె మాజీ ప్రేమికుడు ...

news

ఎడప్పాడికి సీఎం పోస్ట్.. చిన్నమ్మకు జైలు... శశికళ వర్గంలో అసమ్మతి

జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించడంతో ...

news

పన్నీర్‌కు - పళనికి దారేది? గవర్నర్ చేతిలో 'పంచ'తంత్రం

తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీకోసం తిరుగుబాటు నేత ఓ పన్నీర్ సెల్వం, శశికళ అనుచరుడు ఎడప్పాడి ...

news

శశికళ పాలిట సింహస్వప్నం... కర్ణాటక మాజీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ బి.వి.ఆచార్య

జయలలిత అక్రమాస్తుల కేసు దేశంలోనే ఓ సంచలన కేసుగా రికార్డుపుటలకెక్కింది. ప్రస్తుత బీజీపీ ...

Widgets Magazine