గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 25 ఫిబ్రవరి 2017 (02:08 IST)

డాక్టర్ లేని చోట... అత్యవసర ఆపరేషన్ చేసి మహిళను కాపాడిన ఎమ్మెల్యే

ప్రజా ప్రతినిధిగా ఒక రాజకీయన నేత తన నియోజక వర్గ ప్రజలకు ఎంత సహాయం చేయగలడు అనడానికి కొలబద్దలు ఏమీ లేవు. కానీ ఆ ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి చెందిన ఒక మహిళ ప్రాణాలు కాపాడటానికి అత్యవసర ఆపరేషన్ చేసిన ఘటన రాజకీయ నేతల ప్రతిష్టకు మంగళహారతులు అద్దుతోంది. మి

ప్రజా ప్రతినిధిగా ఒక రాజకీయన నేత తన నియోజక వర్గ ప్రజలకు ఎంత సహాయం చేయగలడు అనడానికి కొలబద్దలు ఏమీ లేవు. కానీ ఆ ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి చెందిన ఒక మహిళ ప్రాణాలు కాపాడటానికి అత్యవసర ఆపరేషన్ చేసిన ఘటన రాజకీయ నేతల ప్రతిష్టకు మంగళహారతులు అద్దుతోంది. మిజోరం ఎమ్మెల్యే డాక్టర్ కె బెయిచువా ఈ ఘటనకు కారణభూతుడయ్యారు. ఇంపాల్‌ రీజినల్ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ కె. బెయుచువా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న ఒక మహిళకు అత్యవసర ఆపరేషన్ చేసి ఆమె ప్రాణాలు కాపాడారు. సైహా జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి సర్జన్ ఇంపాల్‌లో శిక్షణా కార్యక్రమానికి వెళ్లిన సందర్బంలో ఈ ఘటన జరిగింది. సర్జన్ అందుబాటులో లేనసమయంలో విపత్తు ఎదుర్కొన్నా ఆ మహిళకు సకాలంలో ఆపరేషన్ చేసిన ఆ ఎంబీబీఎస్ కమ్ ఎమ్మెల్యే ప్రాణదాత అయ్యారు.
 
ఆపరేషన్ ముగిశాక విషయం తెలిసి తనను సంప్రదించిన మీడియాకు ఈ రాజకీయ వైద్యుడు తానే పరిస్థుతుల్లో ఆపరేషన్ చేయవలసి వచ్చిందీ తెలిపారు. 35 ఏళ్ల మహిళ ఒకరు తీవ్రమైన కడుపునొప్పితో బాధపుడుతోందని, తక్షణమే ఆమెకు ఆపరేషన్ చేయాల్సి ఉందని సమాచారం తెలిసింది. ఆ మహిల కడుపులో పెద్ద రంద్రం పడింది. వెంటనే ఆపరేషన్ చేయకపోతే ఆమె ప్రాణాలు కూడా కోల్పోవచ్చు అని ఒక వెబ్ సైట్‌లో వచ్చిన వార్త ఈ ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది. 
 
తన మెడికల్ కెరీర్‌లో వందలాది ఆపరేషన్లు చేసినప్పటికీ, కత్తి పట్టి నాలుగేళ్లయిందని, 2013లో తాను చివరి ఆపరేషన్ చేశానని ఈ డాక్టర్ చెప్పారు. తర్వాత సైహా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఈయన వైద్య వృత్తి వదిలేశారు..52 ఏళ్ల ఈ డాక్టర్ కమ్ రాజకీయనేత 1991లో ఎంబీబీఎస్ పూర్తి చేసి 20 ఏళ్లపాటు వైద్యుడిగా ప్రాక్టీస్ చేశారు. 2013లో మిజో నేషనల్ ఫ్రంట్‌లో చేరారు. 2013లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్ హైటోను 222 ఓట్ల తేడాతో ఓడించిన డాక్టర్ బెయిచు తన పాత వృత్తి సాక్షిగా నిండు ప్రాణం కాపాడారు. 
 
తానిప్పుడు డాక్టర్ కాకున్నా ప్రాణం కాపాడటం కోసం మళ్లీ డాక్టరుగా అవతారమెత్తి శస్త్రచికిత్స చేసి మహిళను కాపాడిన ఆ మానవీయ డాక్టర్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతోంది.