మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 29 నవంబరు 2016 (13:28 IST)

యజమాని కోసం కట్లపామును చంపేసిన శునకం.. బైకు సీటుకు ఆనుకుని ఉన్న పామును చూసి?

శునకం విశ్వాసానికి మారు పేరు. శునకాలు యజమానుల పట్ల అమితమైన ప్రేమను కలిగివుంటాయి. యజమానుల పట్ల విశ్వాసంగా నడుచుకుంటున్నాయి. అలా ఓ శునకం పాము కాటు నుంచి తన యజమానిని రక్షించింది. ఈ ఘటన తమిళనాడులోని ఈరోడ్

శునకం విశ్వాసానికి మారు పేరు. శునకాలు యజమానుల పట్ల అమితమైన ప్రేమను కలిగివుంటాయి. యజమానుల పట్ల విశ్వాసంగా నడుచుకుంటున్నాయి. అలా ఓ శునకం పాము కాటు నుంచి తన యజమానిని రక్షించింది. ఈ ఘటన తమిళనాడులోని ఈరోడ్డు జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. సెన్నిమలైలో నివసిస్తున్న తంగవేల్‌ (44) అనే రైతు తన ఇంట డాబర్‌మేన్ రకానికి చెందిన శునకాన్ని ‘జానీ’ అనే పేరుతో పెంచుకుంటున్నాడు. ఆదివారం సాయంత్రం పొలం నుంచి బైకుపై ఇంటికి తిరిగొచ్చిన తంగవేల్‌ను చూసి జానీ బిగ్గరగా అరిచింది. ఆకలితో ఉందో ఏమోనని.. తంగవేల్ అనుకున్నాడు. 
 
అయితే ఆ శునకం మోటారు బైకు సీటునానుకుని ఉన్న కట్లపామును ముంగాళ్లతో లాగేసింది. అంతటితో ఆగకుండా ఆ పామును నోట కరచుకుని కొరికేసింది. దీన్ని చూసిన యజమానికి కంట నీరొచ్చేసింది. పామును చంపిన ఆ శునకం ఆ తర్వాత యజమాని వద్దకు వచ్చి ఒళ్లంతా తడుముతూ తన విశ్వాసాన్ని, ఆత్మీయతను చాటుకుంది.