గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 26 ఫిబ్రవరి 2015 (12:03 IST)

మమ్మల్ని లాగొద్దు ప్లీజ్ కృష్ణా జలాల పంపకంపై కర్ణాటక!

కృష్ణా జలాల పంపకంపై కర్ణాటక నెమ్మదిగా తప్పుకుంది. ఏపీ విభజన చట్టం ప్రకారం ఆస్తులు, అప్పులు ఎలా పంచుకుంటున్నారో అదేవిధంగా ఉమ్మడి ఏపీలోని కృష్ణా జలాల పంపకం కూడా జరగాలని కర్ణాటక ప్రభుత్వం సూచించింది. కృష్ణా నదీ జలాల పంపిణీ సమస్యను ఆంధ్ర, తెలంగాణకు పరిమితం చేయాలే తప్ప దీనిలోకి తమను లాగొద్దని కర్నాటక సర్కారు ట్రిబ్యునల్‌కు స్పష్టం చేసింది. బుధవారం బ్రిజేష్ ట్రైబ్యునల్ ముందు కర్నాటక తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.  
 
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 89వ సెక్షన్ ప్రకారం కృష్ణా నదీ జలాలను పరివాహక ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలకూ మళ్లీ కేటాయించాలా? లేక కేవలం కొత్తగా ఏర్పడిన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలా? అనే అంశంపై న్యాయమూర్తి బ్రిజేష్ కుమార్ నాయకత్వంలో ఏర్పాటు చేసిన కృష్ణా ట్రిబ్యునల్ విచారణ ప్రారంభించింది.
 
ప్రాజెక్టుల వారీగా పంపకాల ప్రక్రియ, విధి, విధానాలు, పరిధి నిర్ధారణపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, కేంద్ర జలవనరుల శాఖ తమ అభిప్రాయాలను తెలియజేస్తూ అఫిడవిట్లు, కౌంటర్లను దాఖలు చేశాయి. బుధవారం కర్ణాటక ప్రభుత్వం ట్రైబ్యునల్ ముందు తమ వాదనలను వినిపించింది. ట్రైబ్యునల్ రేపు, ఎల్లుడి నాలుగు రాష్ట్రాల వాదనలు విన్న తరువాత తమ పరిధి, విధి విధానాలను ఖరారు చేస్తుంది.